హనుమాన్ జయంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్‌లో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ‘హిందూ ఏక్తా యాత్ర’ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా హిందూ ఏక్తా యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద్భంగా హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ.. ఐదు నెలల్లో తెలంగాణలో రజాకార్ల రాజ్యం పోయి రామ రాజ్యం వస్తుందన్నారు. 15 నిమిషాలు సమయం ఇవ్వండి.. పోలీసులు పక్కకి ఉండండి అన్నా.. ఒవైసీకి చెబుతున్న మేము ఓపిక తో ఉన్నాం కాబట్టి మీరు ఉన్నారని గుర్తుపెట్టుకోండని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ‘తెలంగాణా లో రామరాజ్యం తెచ్చేందుకు ఒక నూతన సమూహం ఏర్పడింది.. తెలంగాణతో పోలిస్తే అస్సాం చాలా చిన్నది..
Also Read : Spy Camera : యాజమానురాలి బెడ్‌రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన పనోడు
ఆర్థికంగా కూడా చిన్నదే… కానీ.. మేము ఉద్యోగులకు 1 వ తేదీన జీతాల ను ఇస్తున్నాం.. తెలంగాణ లో మాతో పోల్చి చూస్తే 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి… కానీ 50 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు.. తెలంగాణ ప్రతిష్టను లిక్కర్ స్కామ్ తో జాతీయ స్థాయిలో దిగజార్చింది. బీఆర్‌ఎస్ సర్కార్ కి వీఅర్ఎస్ ఇచ్చే రోజు దగ్గర్లో ఉంది. బండి సంజయ్ ని అనేక సార్లు జైల్లో వేశారు… ఆయన బయటికి వచ్చిన ప్రతిసారి హనుమాన్ లాగా శక్తిని పుంజుకుంటున్నారు. భారత దేశంలో మోడీ లేకపోతే పాకిస్తాన్ లాంటి ఇతర దేశల్లాంటి పరిస్థితి వచ్చేది. భారత్ ని మోడీ విశ్వ గురు చేస్తారు… అనేక దేశాలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డప్పటికి భారత్ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరలేదు… అది మోడీ ఘనత. సెక్యులర్ సోదరులుగా ప్రకటించుకున్న వారు.. కేరళ స్టోరీ చూడండి… మేము అస్సాంలో మదర్స లను బంద్ చేశాం..’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Congress: “ఇక అధిష్టానం నిర్ణయమే”.. సీఎం అభ్యర్థిపై ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం..