MLAs Poaching Case : హైకోర్టు కీలక ఆదేశాలు.. సీబీఐ నో.. సిట్ దర్యాప్తుని కొనసాగించాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొయినాబాద్ ఫాంహౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా.. ఈ ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే.. ఈ నేపథ్యంలో.. బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి రిట్ అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో.. సిట్ దర్యాప్తుని కొనసాగించాలన్న హైకోర్టు.. కేసుకు సంబంధించిన తుది నివేదికను సీల్డ్ కవర్ లో హైకోర్టుకు అందించాలని ఆదేశించింది. అయితే.. రిట్ పిటిషన్లో.. స్టేను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలని ధర్మాసనాన్ని ప్రేమేందర్ రెడ్డి కోరారు. సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించేలాని ధర్మాసనానికి ప్రేమేందర్ రెడ్డి వెల్లడించారు. అయితే.. ఈ క్రమంలో.. ఫాంహౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన హైకోర్టు.. హైదరాబాద్ సీపీ ఆధ్వర్యంలోని సిట్ టీమే దర్యాప్తు చేస్తుందని, సిట్ విచారణను సింగిల్ జడ్జి మానిటరింగ్ చేస్తారని చెప్పింది.
Also Read : Mohan Babu: కృష్ణ పార్థివ దేహంపై పడి వెక్కి వెక్కి ఏడ్చిన మోహన్ బాబు
Also Read
- Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
- INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
దర్యాప్తు నివేదికను ఈనెల 29న సిట్ సింగిల్ జడ్జికి సమర్పించాలని కోర్టు ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని.. విచారణకు సంబంధించిన డిటెయిల్స్ సీఎంవోకు కానీ.. అధికారికి, మీడియాకు, రాజకీయ నాయకులకు లీక్ చేయొద్దని స్పష్టం చేసింది కోర్టు. ఒకవేళ దర్యాప్తు వివరాలు బయటికి వస్తే హైదరాబాద్ సీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది న్యాయస్థానం. మరోవైపు క్యాంప్ ఆఫీస్ ప్రెస్ మీట్ లో సీఎం పాంహౌస్ వీడియోలు, వివరాలు చెప్పడంపై ప్రభుత్వ తరపు న్యాయవాది విచారం వ్యక్తం చేశారు. మరోసారి ఇది రిపీట్ కాకుండా చూసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు ప్రభుత్వ తరపు లాయర్.
తాజావార్తలు
-
Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..
-
INDIA bloc: రాష్ట్రపతితో రాహుల్ బృందం భేటీ.. విజయ్ చౌక్ వద్ద ఎంపీల నిరసన..
-
Jailer 2 Ticket Price Hike: ఏపీలో ‘జైలర్ 2’ టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
-
IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
-
US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు