కర్నాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థల.. పశ్చిమ కనుమల్లోని ఈ ప్రాంతం మంజునాథ స్వామి ఆలయంతో ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుంది. నిత్యం వేలాదిమంది భక్తులు ఇక్కడ స్వామి దర్శనం కోసం తరలివస్తారు. కానీ, ఈ పవిత్ర భూమి ఇప్పుడు భయంకర ఆరోపణలతో కలకలం రేపుతోంది. రెండు దశాబ్దాలుగా వందలాది మంది హత్యకు గురయ్యారని, లైంగిక వేధింపులు జరిగాయని ఓ పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇన్నాళ్లూ ఈ రహస్యం…
కోల్‌కతా లా కాలేజీ గ్యాంగ్ రేప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కొనసాగించడానికి ఏసీపీ ప్రదీప్ కుమార్ ఘోషల్ పర్యవేక్షణలో 5 మంది సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. ఇకపై ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. కాగా.. దక్షిణ కోల్‌కతాలోని ఓ లా కాలేజీ క్యాంపస్‌లో జూన్ 25న మొదటి సంవత్సరం విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లో రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసులపై సిట్ సోదాలు నిర్వహించింది. మద్యం స్కాంలో రాజ్ కసిరెడ్డి కోసం రేపు కూడా హైదరాబాద్‌లో సిట్ ఉండనుంది. ఇవాళ మూడు చోట్ల గాలించినా కసిరెడ్డి ఆచూకీ లభించలేదు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కసిరెడ్డి డైరెక్టర్ గా ఉన్నట్టు సమాచారం అందటంతో సిట్ అక్కడకి వెళ్లినా ఫలితం లభించలేదు. కసిరెడ్డి భాగ్యనగరంలోనే ఉన్నారని పక్కా సమాచారం అందటంతో మరో 2 రోజులు గాలింపు చర్యలు చేపట్టాలని సిట్ నిర్ణయం తీసుకుంది. తనిఖీల…
వైఎస్ వివేకా హత్య కేసులో సిట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో అనుమానాస్పదంగా మృతి చెందిన సాక్షుల మరణాలపై సిట్ విచారణ చేపట్టనుంది. అనుమానాస్పదంగా మృతి చెందిన శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులను సిట్ డీఎస్పీ విచారించనుంది. పులివెందుల డీఎస్పీ కార్యాలయంలో సిట్ అధికారులు విచారణ మొదలుపెట్టారు.
తిరుమల లడ్డూ వ్యవహారంపై కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిట్ చీఫ్‌గా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది.
ఏపీలో ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాథమిక రిపోర్టు ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం.. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లోనే ఇంకా మకాం వేసింది. మూడు బృందాలుగా విడిపోయిన అధికారులు తిరుపతి, అనంతపురం, పల్నాడు జిల్లాల్లో ఉన్నారు.
ఏపీలో పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై 13 మంది సభ్యులతో కూడిన సిట్ బృందం విచారణ కొనసాగుతోంది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి ఏకపక్షంగా వ్యవహరించిన అధికారుల తీరుపై విచారిస్తోంది.
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. హింసాత్మక ఘటనలపై సిట్ విచారణ జరుపుతోంది. డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సిట్ సారథి వినీత్ బ్రిజ్ లాల్ భేటీ అయ్యారు.
Revanth Reddy: దేశ రాజధాని ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. నిన్న ఏఐసీసీ కార్యక్రమంలో పాల్గొని ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు.
ఉత్తరప్రదేశ్ లో సంచలన సృష్టించిన గ్యాంగ్ స్టర్ అతిత్ అహ్మద్ హత్య కేసులో సిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఏప్రిల్ 15న గ్యాంగ్‌స్టర్లు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లను కాల్చి చంపిన క్రైమ్ సీన్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ రోజు పునర్నిర్మించింది.