High Court : ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్యే కొనుగోలు కేసుల్లో జడ్జ్ మెంట్ లో కీలక విషయాలు ప్రస్తావించింది హైకోర్టు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనన్న హైకోర్టు.. ముఖ్యమంత్రికి సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమయిందని అసహనం వ్యక్తం చేసింది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి ప్రజల వద్దకు వెళ్లిపోయాయన్నారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికి చెప్పకూడదని, దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాకుండా.. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఫెర్ ఇన్వెస్టిగేషన్ లాగా అనిపించలేదు.
Also Read : Cobra Fight : తుపాకీ కాల్పులకు ఎదురుతిరిగిన పాము
దర్యాప్తు ఆధారాలు బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదు. ఆర్టికల్ 20, 21 ప్రకారం న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని, బీజేపీ పిటిషన్ మెయింటైనబుల్ కాకపోవటంతో పిటిషన్ డిస్మిస్ అయ్యిందని తెలిపింది. నిందితులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు.. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. ఎఫ్ ఐ ఆర్ 455/2022 సీబీఐకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. సిట్ చేసిన దర్యాప్తు రద్దు చేస్తున్నట్లు, 26 కేసుల జడ్జిమెంట్లను కోడ్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసును కోర్టు ప్రస్తావించింది. సీబీఐకి ఇవ్వడానికి 45 అంశాలను చూపెడుతూ జడ్జిమెంట్ ఇచ్చింది హైకోర్టు. సీఎం ప్రెస్ మీట్ ను కూడా ఆర్డర్ లో మెన్షన్ చేసిన హై కోర్టు.. కోర్ట్ ఆర్డర్ లో సిట్ ఉనికిని ప్రశ్నించింది. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన పరిధి దాటి వ్యవహరించిందని, కోర్టుకి ఇవ్వలసిన డాక్యుమెంట్స్ ని పబ్లిక్ చేసారని మండిపడింది.
Also Read
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
తాజావార్తలు
-
IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
-
Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!