Hesham Abdul Wahab Said I worked hard for Manamey Movie: హేషమ్ అబ్దుల్ వహాబ్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఖుషి, స్పార్క్, హాయ్ నాన్న సినిమాలతో తెలుగు సినీ సంగీత ప్రియుల్ని మెప్పించారు. ఇప్పుడు ‘మనమే’ చిత్రంతో మరోసారి మాయ చేస్తున్నాడు. శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించిన చిత్రం మనమే. కృతి శెట్టి కథానాయికగా నటించిన ఈ సినిమాను టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. జూన్ 7న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ మీడియా సమావేశంలో విశేషాలు పంచుకున్నారు.
హేషమ్ అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ… ‘ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ విభిన్నమైన కథలతో ప్రయాణం చేయాలనుకుంటాడు. నా కెరీర్ ఆరంభంలోనే విభిన్నమైన కథలతో నిరూపించుకునే అవకాశం దక్కింది. ఇది దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా సంగీత ప్రతిభ అంతటినీ మనమే ద్వారా ప్రేక్షకులకు చూపిస్తా. ఈ సినిమా కోసం నా గత చిత్రాల కంటే ఎక్కువ కష్టపడ్డాను. నాకు మాత్రమే కాదు.. శర్వానంద్, కృతి శెట్టి, శ్రీరామ్ ఆదిత్యకు ఈ చిత్రం ఎంతో ప్రత్యేకం. చిత్ర బృందమంతా ప్రాణం పెట్టి పని చేసింది. అందరం చాలా నమ్మకంగా ఉన్నాం’ అని చెప్పాడు.
Also Read: Rakul Preet Singh: మధ్య వయసు గల వ్యక్తితో రొమాన్స్.. రకుల్ పోస్ట్ వైరల్!
‘హాయ్ నాన్నకు పూర్తి భిన్నమైన చిత్రం ఇది. అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయి. సంగీతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో 16 పాటలు ఉన్నాయి. ఇలాంటి సినిమా చేయడం నా కెరీర్‌లో ఇదే మొదటిసారి. ఈ చిత్ర సంగీతం పనులు మొదలు పెట్టినప్పుడు ఇన్ని పాటలు వస్తాయని మేము ఊహించలేదు. శ్రీరామ్ ఆదిత్య నాకు మంచి మ్యూజిక్ చేసే అవకాశమిచ్చారు. కథ రీత్యా ప్రథమార్ధంలో 10 పాటలు, ద్వితీయార్ధంలో 6 పాటలు పెట్టాల్సి వచ్చింది. 10 పాటలు పూర్తి నిడివితో ఉంటాయి. మిగిలినవి బిట్స్ సాంగ్స్’ అని హేషమ్ అబ్దుల్ వహాబ్ తెలిపాడు.