పూజా హెగ్డే పరిస్థితి తారుమారైంది. వరుసగా ఆరో ప్లాప్ ను ఆమె తన ఖాతాలో వేసుకుంది. పూజా లేటెస్ట్ రిలీజ్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ నిరాశపరిచింది. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ పరాజయం నేపథ్యంలో పూజా డిప్రెషన్ కి గురయినట్లు సమాచారం. కెరీర్ ప్రమాదంలో పడగా ఎలా కమ్ బ్యాక్ ఇవ్వాలనే ఆలోచనలో పడింది ఈ బుట్ట బొమ్మ. ఈ క్రమంలో ఆమె టూర్ కి వెళ్లారు. మానసిక ఒత్తిడి నుంచి బటయపడే ప్రయత్నం చేస్తున్నారట. శ్రీలంక ట్రెడిషనల్ వేర్లో పూజా సరికొత్తగా దర్శనమిస్తుంది.
Also Read : Megastar – Super star : అటు మెగాస్టార్.. ఇటు సూపర్ స్టార్.. పోరులో గెలిచేదెవరు..?
2022లో ఆమెకు వరుస షాకులు తగిలాయి. ఒకదానికి మించిన మరో డిజాస్టర్ పూజా ఖాతాలో వచ్చి పడ్డాయి. రాధే శ్యామ్ మూవీతో ఆమె సక్సెస్ గ్రాఫ్ పడుతూ వచ్చింది. నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న రాధే శ్యామ్ ప్రభాస్ కెరీర్లో భారీ నష్టాలు మిగిల్చిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. వందల కోట్ల నష్టం రాధే శ్యామ్ సినిమా మిగిల్చింది. రాధే శ్యామ్ ఫెయిల్యూర్ నుంచి బయటపడే లోపే మరో డిజాస్టర్ పలకరించింది. రాధే శ్యామ్ కి మించిన పరాజయం ఆచార్య చవిచూసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన చిరంజీవి-రామ్ చరణ్ ల మల్టీస్టారర్ రెండో రోజే ఆచార్య సినిమాను థియేటర్స్ నుంచి ఎత్తేస్తారు. ఏప్రిల్ లో విడుదలైన ఆచార్య పూజాకు ఊహించని షాక్ తగిలింది. రాధే శ్యామ్, ఆచార్య చిత్రాల మధ్యలో ఆమెకు మరో ప్లాప్ పడింది.
Also Read : Siddipet Crime: కొడుకులు పంచుకున్నారు.. భరించలేక తన చితికి తానే నిప్పంటించుకున్న తండ్రి
విజయ్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ బీస్ట్ ప్లాప్ టాక్ మూటగట్టుకుంది. రాధే శ్యామ్, ఆచార్యలతో పోల్చుకుంటే నష్టాలు తక్కువే అయినప్పటికీ ఈ మధ్య కాలంలో విజయ్ నటించిన ప్లాప్ మూవీగా బీస్ట్ రికార్డులకు ఎక్కింది. బాలీవుడ్ చిత్రం సర్కస్ వీటన్నింటినీ మించిన డిజాస్టర్ అయ్యింది. రణ్ వీర్ సింగ్ హీరోగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన సర్కస్ వరస్ట్ ఫిల్మ్ గా ప్రేక్షకులు తెలిపారు. ప్రస్తుతం పూజా ఎస్ఎస్ఎంబీ 28 మూవీలో నటిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే హీరోయిన్ గా యాక్ట్ చేస్తుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.