Sathyaraj-SSMb29: రాజమౌళి-మహేశ్ ప్రాజెక్ట్‌లో అవకాశం.. క్లారిటీ ఇచ్చిన కట్టప్ప!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sathyaraj about SSMb29 Movie Chance: సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో గుహన్ సెన్నియ్యప్పన్ తెరకెక్కించిన చిత్రం ‘వెపన్’. ఎంఎస్ మన్జూర్ సమర్పణలో మిలియన్ స్టూడియో బ్యానర్ నిర్మించిన ఈ చిత్రంలో తాన్యా హోప్, యాషికా ఆనంద్, రాజీవ్ మేనన్, రాజీవ్ పిళ్లై, కనిహ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 7న వెపన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సత్యరాజ్ అలియాస్ కట్టప్ప.. ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్ బాబు ప్రాజెక్ట్‌లో అవకాశంపై స్పందించారు.
రాజమౌళి-మహేశ్ ప్రాజెక్ట్‌లో మీరు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. నిజమేనా? అని సత్యరాజ్‌ని ఓ రిపోర్టర్ అడిగాడు. ‘డైరెక్టర్ రాజమౌళి గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. బాహుబలి తర్వాత ప్రపంచం మొత్తానికి నేను కట్టప్పగా పరిచయం అయ్యాను. యానిమేషన్ సిరీస్ వచ్చాక చిన్న పిల్లలు కూడా నన్ను కట్టప్పగానే గుర్తిస్తారు. బాహుబలి సినిమాలో నాకు కండలు ఉన్నట్లు చూపించారు. యానిమేషన్ సిరీస్‌లో అయితే ఇంకా ఎక్కువగా చూపించారు. బయట నేను అలానే ఉంటానని పిల్లలు అనుకుంటారు. మహేశ్ బాబు, రాజమౌళి సినిమా కోసం ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేదు. రాజమౌళి నాకు పాత్ర ఇస్తే వెంటనే అంగీకరిస్తా’ అని కట్టప్ప తెలిపారు.
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
Also Read: Buchi Babu: ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు ఇంట్లో తీవ్ర విషాదం!
ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌లో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలపై సత్యరాజ్ స్పందించారు. ‘ప్రధాని మోడీ బయోపిక్‌లో నేను నటించడం లేదు. నేను కాస్త ఆయనలా కనిపిస్తాను. కొందరు మా ఇద్దరి ఫొటోలు పక్కపక్కన పెట్టి.. నేను బయోపిక్‌లో నటిస్తున్నట్లు ఇమేజ్‌లు చేశారు. అప్పటి నుంచి ఈ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో ఏమాత్రం నిజం లేదు’ అని సత్యరాజ్ స్పష్టం చేశారు. బాహుబలి తర్వాత తెలుగులో నోటా, ప్రతిరోజూ పండగే, జెర్సీ, రాధేశ్యామ్ తదితర సినిమాల్లో నటించారు.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!