Satya Dev As Brand Ambassador Srichakra Milk Products: ‘శ్రీచక్రా మిల్క్ ప్రోడక్ట్స్ ఎల్ఎల్‌పీ’ తమ ప్రయణం మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని మియాపూర్ నరేన్ ప్యాలెస్‌లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికూమార్, టీడీ జనార్దన్, గడ్డం ప్రసాద్, మూరకొండ జగన్మోహన్ రావు సహా హీరోలు విజయ్ దేవరకొండ, సత్యదేవ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శ్రీచక్రా మిల్క్ ప్రోడక్ట్స్ కోత్త లోగోను రవికూమార్ అవిష్కరించగా.. బ్రౌచర్‌ని గడ్డం ప్రసాద్ ఆవిష్కరించారు.
శ్రీచక్రా మిల్క్ ప్రోడక్ట్స్ కమర్షియల్ యాడ్‌ని విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. ఇక శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో సత్యదేవ్ ఉన్నారు. బ్రాండ్ అంబాసిడర్‌గా ఉనందుకు సంతోషంగా ఉందని సత్యదేవ్ చెప్పారు. శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్ తొలిసారిగా 2014లో పశ్చిమగోదావారి జిల్లా నల్లజర్ల మండలంలోని అవపాడు గ్రామంలో మొదలెట్టారు. ఆపై రాయలసీమలో, అనంతపురం జిల్లాలోని గజరాంపల్లి గ్రామంలో, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అంతారం గ్రామంలో అతిపెద్ద ఫ్యాక్టరీలతో వినియోగదారులు, పాడి రైతులకు మరింత దగ్గరగా వ్యాపారాన్ని విస్తరించారు.
Also Read: Indian Cricket Team: పాకిస్థాన్ ‘డాన్’ పత్రిక మొదటి పేజీలో టీమిండియా ఫొటో!
నాణ్యతే లక్ష్యంగా, ఖచ్చితమైన భద్రతాప్రమాణాలే ధ్యేయంగా, ఆధునిక పరికరాలతో 18 పాల శీతలీకరణకేంద్రాలు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల టెట్రాప్యాక్కింగ్ మిషినరీతో పాలు మరియు పాల ఉత్పత్తులతో 25 వేలకు పైగా కుటుంబాలకు, వెయ్యికి పైగా రెస్టారెంట్లకు, అనేక ప్రభుత్వ-ప్రయివేట్ విద్యాసంస్థలకు రోజువారీ ఆహారంలో భాగమై.. వారి ఆనందానికి, ఆరోగ్యానికి కారణమై నిలిచింది. పదేళ్ల ప్రస్థానంలో 200 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్, లక్ష మందికి పైగా ఉపాధి కల్పించింది. శ్రీచక్ర మిల్క్ ప్రొడక్ట్స్ దినదినాభివృద్ధి చెంది రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులతో తమదైన స్థానాన్ని సంపాదించింది.