పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తుండగా అందాల భామ కావ్య థాపర్ రామ్ సరసన జోడిగా నటిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ బ్లాక్ బస్టర్ కు కొనసాగింపుగా వస్తోన్న ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి కౌర్, పూరి జగన్నాధ్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ గా కనించనున్నాడు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ విడుదలకు రెడీ గా ఉంది.
Also Read : Double ismart: రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ మధ్య విభేదాలు నిజమేనా.. ప్రమోషన్స్ కు పూరి దూరం..?
విడుదలకు మహా అయితే ఇంకో 9 రోజులు టైమ్ ఉంది. కానీ ఇప్పటికి ఈ చిత్ర ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. గత ఆదివారం విశాఖలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హీరో రామ్, కావ్య థాపర్ సందడి చేసారు. తదుపరి డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్స్ ను గట్టిగా ప్లాన్ చేశారు నిర్మాత ఛార్మి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రెండు కామన్ ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసారు. అందులో ఒకటి హీరో రామ్, కావ్య లతో గెటప్ శీనులతో ఆటోలో తిరుగుతూ చిట్ చాట్ ప్లాన్ చేసారు. మరోటి పూరి జగన్నాధ్, రామ్, కావ్య, ఆలిలతో ఛార్మీ ఓ వినూత్న కార్యక్రమం ప్లానింగ్ లో ఉంది. ఇవేకాకుండా పూరి, హీరో రామ్ పోతినేని, సంజయ్ దత్ ముగ్గురు కలిసి ముంబాయిలో సాంగ్ లాంఛ్ చేయబోతున్నారు. లైగర్ వ్యవహారం త్వరగా ఫైనల్ అయితే పబ్లిసిటీలో వేగం పెరగనుంది. మరోవైపు డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు నిర్మాత ఛార్మి.