NTV Telugu Site icon

Weather Update: పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలర్ట్

Weather

Weather

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీవర్షాలు కురుస్తూన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో ఐఎండీ అధికారులు అలర్ట్ జారీ చేశారు. రానున్న ఐదు రోజుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భారీవర్షాలు పడతాయని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఇండోర్, రత్లాం, చింద్వారా, మందసౌర్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడి భారీవర్షాలు పడుతాయని ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Read Also: Manipur BJP MLA: ప్రధాని మోడీపై మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం.. కలవడానికి అవకాశమివ్వలేదు

రాజస్థాన్ లోనూ నేటి నుంచి భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్‌లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర ప్రాంతంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రలోని ఘాట్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్ర- తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

Read Also: Kethika Sharma : బిగుతైనా అందాలతో రెచ్చగొడుతున్న కేతిక శర్మ..

రాయ్‌గఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, కొల్హాపూర్ జిల్లాల్లో రాబోయే 3 రోజుల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముంబయి, పూణే జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలోనూ తేలికపాటి వర్షం కురవడంతో యమునా నదిలో వరదనీరు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ యమునా నదీ నీటిమట్టం 205.75 మీటర్లకు పెరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల మధ్య గుజరాత్‌లో వరదలు పొటెత్తాయి. గుజరాత్‌లో భారీ వర్షాలతో జలమయమైన ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగింది. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రానికి ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది.