రుచికి పుల్లగా ఉండి, పోషక విలువలు ఎక్కువగా ఉన్న పండ్లలో ద్రాక్ష కూడా ఒకటి.. ద్రాక్షలో ఇప్పుడు నల్లని ద్రాక్షాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలు దూరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
సాదారణంగా నల్ల ద్రాక్షలో విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇవి రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. ఓ పరిశోధన ప్రకారం గ్రేప్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగ నిరోధక శక్తి పెంచుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు నల్ల ద్రాక్ష తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. డైట్ చేసేవారు నల్ల ద్రాక్ష తీసుకుంటే శరీరం అలసటగా ఉండకుండా చేస్తుంది. ద్రాక్షలో విటమిన్ కె కూడా ఉంటుంది. ఇవి ఎముకలను బలంగా ఉండేలా చేస్తుంది..
అదే విధంగా మెదడు చురుగ్గా ఉంటుంది. అందువల్ల వీటిని అప్పుడప్పుడు పిల్లలకు తినిపిస్తూ ఉండాలి. దంతాలు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు ద్రాక్షనుతీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇక ద్రాక్ష దీర్ఘాయువు పెంచుతుందని కొన్ని అధ్యయనాల ద్వారా తెలుస్తుంది.. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది..ఇక ద్రాక్ష జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఆకలి పెరుగుతంది. నోరు టేస్టీగా ఉండి ఎలాంటి ఇన్ఫెక్సన్ కాకుండా ఆపుతుంది.. వీటిని తీసుకొనే ముందు కాయలను బాగా కడిగి తినాలి.. వాటిపై కెమికల్స్ ఉంటాయి.. రోజు ఈ ద్రాక్షలను జ్యూస్ రూపంలో తీసుకుంటే స్కిన్ ఫిట్నస్ తో పాటు చర్మ రంగు కూడా పెరుగుతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.