Argentina: భారీ వర్షాల దెబ్బకి 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు
- అర్జెంటీనాలో కురుస్తున్న భారీ వర్షాలు.
- వరదలకు 16 మంది మృతి.. అనేక మంది గల్లంతు
- గల్లంతైన వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Argentina: అర్జెంటీనాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోగా, పలు మంది గల్లంతయ్యారు. అధికారుల ఇచ్చిన సమాచారం ప్రకారం.. అర్జెంటీనాలోని తూర్పు తీరంలోని బహియా బ్లాంకా నగరంలో వర్షాలు తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. గత రెండు రోజుల క్రితం ప్రారంభమైన ఈ వర్షానికి వచ్చిన వరద నీటిలో అనేక మంది గల్లంతయ్యారు. ప్రభుత్వ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, రాజధాని బ్యూనస్ అయర్స్‌కు దక్షిణంగా ఉన్న బహియా బ్లాంకా నగరం నుంచి 1,450 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Read Also: MLA Quota MLC elections: నేడు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్.. అసంతృప్తులకు బుజ్జగింపులు..!
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
గత రెండు రోజుల్లో బహియా బ్లాంకాలో సుమారు 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. సాధారణంగా అక్కడి సగటు నెలవారీ వర్షపాతం సుమారు 129 మిల్లీమీటర్లు మాత్రమే. అయితే, రాబోయే 72 గంటల పాటు వర్షం కురిసే అవకాశం లేదని తెలియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం వరదల కారణంగా 10 మంది మృతి చెందారని ప్రకటించిన అధికారులు, ఆదివారం ఈ సంఖ్య 16కి చేరుకున్నట్లు వెల్లడించారు. బహియా బ్లాంకా నగరంలోని మేయర్ కార్యాలయం ప్రకారం, మరిన్ని ప్రాణ నష్టాలు జరిగే అవకాశముందని వెల్లడించారు. రాజధాని బ్యూనస్ అయర్స్ నుండి సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ నగరంలో సుమారు 3.5 లక్షల మంది జనాభా ఉంది.
Read Also: Final Judgement: ప్రణయ్ పరువు హత్య కేసు.. నేడే తుది తీర్పు
తీవ్రంగా ముంచుకొచ్చిన వరద నీటిలో చిక్కుకున్న ఓ కారులో ఐదుగురు జల్ సమాధి అయ్యారు. ప్రొవిన్షియల్ సెక్యూరిటీ మంత్రి జేవియర్ అలొన్సో తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం ఉదయం ప్రారంభమైన వర్షం కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో సుమారు 400 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది సాధారణంగా బహియా బ్లాంకాలో సంవత్సరమంతా వచ్చే వర్షపాతంతో సమానమని వెల్లడించారు. సెక్యూరిటీ మంత్రి బుల్రిచ్, రక్షణ మంత్రి లూయిస్ పెట్రీ తాకిడికి గురైన ప్రాంతాన్ని సందర్శించడానికి ప్రయత్నించారు. అయితే, వారి పర్యటన ఆలస్యంగా జరిగిందన్న కారణంగా స్థానిక ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ప్రస్తుతం గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?