NTV Telugu Site icon

Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో కుండపోత వాన.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక

Hyderabad

Hyderabad

Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలో చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం మొదలైంది. జీడిమెట్ల కుత్బుల్లాపూర్‌, చింతల్, షాపూర్ నగర్, గాజులరామారం, సూరారం, బాచుపల్లి, నిజాంపేట తదితర ప్రాంతాలలో ఈదుర గాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. మెహిదీపట్నం, ఖార్వాన్, మాసబ్‌ ట్యాంక్, సికింద్రాబాద్‌, గాంధీ ఆసుపత్రి, రైల్వే స్టేషన్, మెట్టుగూడ, సీతాఫల్ మండి, చిలకలగూడ, బషీర్ బాగ్, కోటి, అబిడ్స్ , బేగం బజార్, సోమాజిగూడ, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లి, అబిడ్స్, గోషామహల్, అఫ్జల్‌గంజ్‌లలో, మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలోనే పలు ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. నాలాలు పొంగిపొర్లాయి. జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. మరో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ.

నగరంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్, ఈవీడీఎం డైరెక్టర్‌తో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాళాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యం లో చెట్లు విరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

Read Also: Virat Kohli: ఒక్కసారి వీడ్కోలు పలికితే.. నన్ను చూడలేరు.. విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు..

నగరంలో పల్లు చోట్ల కురుస్తున్న భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, వారి సర్కిల్‌ పరిధిలోని ఎమర్జెన్సీ బృందాలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా రోడ్లపై నిలిచిపోయిన నీటిని జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న డీఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేయాలని డిప్యూటీ మేయర్ ఆదేశించారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని విరిగిపడ్డ చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులందరూ తమ తమ ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించాలని డిప్యూటీ మేయర్ ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నుంచే సమస్యలను క్షేత్రస్థాయి సిబ్బందికి వెంటనే తెలియజేయాలని సూచించారు. సిటిజన్స్ ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే జీహెచ్ఎంసీ కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.