శ్రీలంక రాజధాని కొలంబోలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో శ్రీలంక-పాకిస్తాన్ మధ్య జరగాల్సిన కీలకమైన సూపర్-4 మ్యాచ్ మరింత ఆలస్యం కానుంది. ఆసియా కప్ 2023లో భాగంగా.. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరుగాల్సి ఉండగా.. ఇంకా టాస్ కూడా వేయలేదు. అయితే ఒకవేళ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైతే.. శ్రీలంక ఫైనల్ కు చేరుకుని నవంబర్ 17న ఇదే స్టేడియంలో భారత్‌తో తలపడనుంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ టీమ్ కు టెన్షన్ గా మారింది.
RSS Meeting: పూణేలో RSS సమన్వయ సమావేశం.. ఐదు అంశాలపై చర్చ
శ్రీలంకలో ఇప్పటివరకు జరిగిన ఆసియా కప్ 2023 మ్యాచ్‌లలో.. ప్రతికూల వాతావరణం కారణంగా చాలా మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది. భారత్‌పై ఓటమి తర్వాత పాకిస్థాన్‌కు ఈ మ్యాచ్ డూ ఆర్ డై అని చెప్పవచ్చు. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు 5 మార్పులతో బరిలోకి దిగుతుందని కెప్టెన్ బాబర్ అజం చెప్పారు. మరోవైపు పాకిస్థాన్ నెట్ రన్ రేట్ శ్రీలంక కంటే తక్కువగా ఉంది. అందువల్ల ఈ మ్యాచ్ రద్దు అయితే పాకిస్తాన్ ఫైనల్ చేరుకోలేదు.
MP Sanjay Singh: ‘ఒకవైపు అమరవీరుల అంతిమయాత్ర, మరోవైపు జీ20 సంబరాలు’ బీజేపీపై ఫైర్
ఈ టోర్నీలో ఇప్పటివరకు శ్రీలంక చాలా మంచి ప్రదర్శన కనబరిచింది. భారత్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో చివరి వరకు పోరాడినా.. ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. శ్రీలంక ఆడిన ఆట తీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు శ్రీలంకపై గెలవడం అంటే అంత ఈజీ కాదు. అయితే పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్‌లో మరోసారి అందరి దృష్టి శ్రీలంక 20 ఏళ్ల స్పిన్నర్ దునిత వెల్లలాగేపైనే ఉంది.
Shabbir Ali: తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు..
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు.. ఫాస్ట్ బౌలర్ జమాన్ ఖాన్ ను ఆడించనుంది. జమాన్ ఇప్పటి వరకు టీ20 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు ఆడాడు. ఈ మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేయనున్నాడు. జమాన్‌ను శ్రీలంకకు చెందిన మలింగ అని కూడా పిలుస్తారు. అతని బౌలింగ్ యాక్షన్ కూడా మలింగ బౌలింగ్ కు దగ్గరగా ఉంటుంది.