శ్రీశైలం జలాశయం గేట్లను అధికారులు కాసేపటి క్రితం ఎత్తేశారు. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 3 గేట్లు ఎత్తి 80 వేల క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో రూపంలో 4.67,210 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది.
పర్యాటకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఆ సమయం రానేవచ్చింది.. ఈ రోజే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తేందుకు సిద్ధం అయ్యారు అధికారులు.. నేడు సాయంత్రం శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి.. దిగువకు నీరు విడుదల చేయనున్నట్టు ఇరిగేషన్ శాఖ అధికారులు వెల్లడించారు.. ఇప్పటికే జలాశయానికి గంటగంటకు పెరుగుతోంది వరదప్రవాహం.. ఓవైపు కృష్ణా నది.. మరోవైపు తుంగభద్ర రివర్ నుంచి పెద్ద ఎత్తున నీరు వచ్చి శ్రీశైలంలో చేరుతోంది..