Husnabad : మొంథా తుఫాన్ నిండా ముంచింది. రైతులకు చేతికొచ్చిన పంటను సర్వనాశనం చేసింది. ఇంకో రెండు రోజులైతే అమ్ముకుందాం.. డబ్బులొస్తాయి అని మురిసిన రైతుల నోట్లో మట్టి కొట్టింది. ఆరుగాళం కష్టపడి రక్తం దారబోసి పంట పండిస్తే.. ఒక్క గింజ కూడా మిగల్చకుండా ఊడ్చుకుపోయింది. ఎటు చూసినా రైతుల కన్నీళ్లే.. గుండెలు పిండేసే బాధలే.. ఈ హృదయవిదారకర ఘటన హుస్నాబాద్ మార్కెట్ యార్డులో కనిపించింది. భీకర వర్షానికి మార్కెట్ యార్డులోకి భారీగా వాన నీళ్లు వచ్చి…