ఈ మధ్య వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్న వారిసంఖ్య ఎక్కువగా ఉంది.. చిన్న వయస్సు వారిలోనూ గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. WHO ప్రకారం, హృదయ సంబంధ వ్యాధులు ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏడాదికి 17 మిలియన్ల కంటే ఎక్కువ మంది గుండె జబ్బుల కారణంగా మరణిస్తున్నారు. ఆసియన్లలోనూ గుండె సంబంధత సమస్యలు ఎక్కువవుతున్నాయని ఓ తాజా అధ్యయనం స్పష్టం చేసింది.. ఇలా సమస్యలు రావడానికి కారణం జీవనశైలిలో మార్పు కారణం అని నిపుణులు చెబుతున్నారు..
ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే మంచి ఆహరం తీసుకోవాలి.. దాంతో పాటు తరచు మందారం టీ తాగితే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు. మందారం మన గుండె ఆరోగ్యాన్ని ఎలా రక్షిస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మందారలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనం వాస్కులర్ ఎండోథెలియం నుంచి నైట్రిక్ ఆక్సైడ్ విడుదలకు తోడ్పడుతుంది. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది..రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి, రక్తనాళాలు పగిలిపోవడాన్ని అథెరోస్క్లెరోసిస్ అంటారు. ఇది ప్రాణాంతకం కావచ్చు. మందారం తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్, చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుంది. రక్తనాళాలలో ఆక్సీకరణ ఒత్తిడి, తక్కువ-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ ఆక్సీకరణం, నురుగు కణాల నిర్మాణాన్ని మందారం తగ్గిస్తుంది.. శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ అయినప్పుడు.. అది అథెరోస్క్లెరోసిస్‌కు దారి తీస్తుంది. ఇది అనేక గుండె సమస్యల ముప్పును పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మందారలో ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాలు, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.. అందుకే కొవ్వు కంట్రోల్ అవుతుంది
మందారంలో కార్డియో-ప్రొటెక్టివ్‌గా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల సమూహమే దీనికి కారణం. యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి, తద్వరా ఇన్ఫ్లమేషన్‌ను నియంత్రిస్తాయి.. దాంతో గుండె ఆరోగ్యంతో పాటు మరెన్నో సమస్యలు తగ్గుతాయి.. జుట్టు పెరుగుతుంది.. చర్మ రంగు మారుతుంది.. రోజూ తీసుకోవడం వల్ల మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి..