Mansukh Mandaviya: భారతదేశంలో వేగంగా పెరుగుతున్న గుండెపోటు కేసులు కరోనా మహమ్మారికి సంబంధించినదా? అనే ప్రశ్న నేడు అందరి మదిలో మెదులుతోంది. అవును ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం తెలిసింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుండెపోటుకు అసలు కారణం, దానిని నివారించడానికి మార్గాలను చెప్పారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) చేసిన అధ్యయనాన్ని ఉదహరిస్తూ.. గతంలో తీవ్రమైన కొవిడ్ -19 వ్యాధితో బాధపడిన వ్యక్తులు ఒకటి లేదా రెండు సంవత్సరాల పాటు ఒత్తిడితో, శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిదని సూచించారు. శారీరక శర్మ లేకుండా ఉంటే వారు గుండెపోటు నుంచి తమను తాము రక్షించుకోవచ్చన్నారు. ఇటీవల గుండెపోటు మరణాలు పెరుగుతోన్న నేపథ్యంలో వీటిపీ ఐసీఎంఆర్ చేసిన అధ్యయనాన్ని ఆయన వివరించారు. కరోనా బాధితులు గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత రెండేళ్ల వరకూ కఠిన వ్యాయామాలకు దూరంగా ఉండాలన్నారు.
Also Read: Gujarat: సూరత్‌లోని సామూహిక ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. పోస్టుమార్టం రిపోర్ట్ లో ఏముందంటే..
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ విలేకరులతో మాట్లాడుతూ, “ICMR ఒక వివరణాత్మక అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం, తీవ్రమైన కోవిడ్ -19 ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న వ్యక్తులు శ్రమతో కూడిన పని చేయకూడదు. వారు ఎక్కువ సమయం పాటు విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామం, పరుగు, అధిక వ్యాయామం నుంచి ఒక సంవత్సరం లేదా అవసరమైన దానికంటే ఎక్కువ కాలం దూరంగా ఉండండి, తద్వారా గుండెపోటును నివారించవచ్చు.” అని ఆయన వివరించారు.
Read Also: Bengaluru: బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం, అగ్నికి ఆహుతైన 10 బస్సులు.. వీడియో ఇదిగో!
గుజరాత్‌లో ఇటీవల నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘గర్బా’ కార్యక్రమాలతో సహా గుండె సంబంధిత సమస్యల కారణంగా అనేక మరణాలు సంభవించాయి. రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ కార్డియాలజిస్టులతో సహా వైద్య నిపుణులతో సమావేశాన్ని నిర్వహించాలని ప్రేరేపించారు. గుండెపోటుకు గల కారణాలను తెలుసుకోవడానికి, నివారణకు తీసుకోవాల్సిన చర్యలను తెలుసుకోవడానికి మరణాల సమాచారాన్ని సేకరించాలని రుషికేష్ పటేల్ నిపుణులను కోరారు.