AP High Court: వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా..
- వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్ పై హై కోర్టులో విచారణ
- కౌంటర్ దాఖలుకు సమయం కోరిన న్యాయవాదియ
- విచారణ వాయిదా వేసిన హైకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైఎస్ జగన్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హై కోర్టులో విచారణ జరిగింది. విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టులో నారాయణ దాఖలు చేసిన కేసుకు సంబంధించి వైఎస్ జగన్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కౌంటర్ దాఖలు చేసేందుకు మంత్రి నారాయణ తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూద్రా సమయం కోరారు. వరుసగా విచారణకు సమయం కోరుతున్నారని పిటిషన్‌ను రెగ్యులర్ విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోరారు. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో హైకోర్టు విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.
READ MORE: Meerpet Murder Case : మీర్ పేట్ మర్డర్ కేస్.. గురుమూర్తికి 14 రోజుల రిమాండ్
Also Read
- NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
- VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసల జల్లు..
- Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
- PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
కాగా.. అమరావతి రాజధాని నిర్మాణ క్రమంలో చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్ మెంట్ మార్పుల వెనుక అప్పటి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ పాత్ర ఉందంటూ ఓ పత్రికలో రాసిన కథనాలు తన పరువుకు నష్టం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో మంత్రి దావా వేశారు. దీనిపై గతంలో అక్కడ విచారణ జరిగింది. అలాగే జగన్ హాజరు కావాలని పలుమార్లు కోర్టు సమన్లు కూడా పంపింది. అయినా ఆయన హాజరు కాలేదు. ఆ తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మంత్రి నారాయణ విజయవాడలోని ప్రజాప్రతినిధుల కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేసిన పరువునష్టం కేసును కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా పడింది.
READ MORE: Chamala Kiran Kumar Reddy : కేంద్రం బీహార్‌కు, ఏపీకి ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వట్లేదు
తాజావార్తలు
-
NTA Exam Reform: పరీక్షా సంస్కరణల హైపవర్ కమిటీ సభ్యులు వీరే..
-
VVS Laxman: జింబాబ్వే సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా.. వీవీఎస్ లక్ష్మణ్‌పై ప్రశంసల జల్లు..
-
Zimbabwe Captain: సికందర్ రజా అరుదైన రికార్డు.. రోహిత్, బాబర్లను దాటేసిన జింబాబ్వే కెప్టెన్..
-
Mohan Bhagwat : మాతృశక్తిని మర్చిపోవడమే దేశ పతనానికి కారణం
-
PM Modi: పరీక్షా సంస్కరణలకు ప్రధాని మోడీ శ్రీకారం.. నందన్ నీలేకనికి కీలక బాధ్యత..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!