ఈ మధ్య వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కిడ్నీల సమస్యలతో భాధపడుతున్నారు.. అందులో ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు రావడం.. ఈ సమస్య రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. తక్కువ నీరు త్రాగడం, ఎక్కువ మాంసం తినడం, అధిక యూరిక్ యాసిడ్, ఊబకాయం, గౌట్, డయాబెటిస్ మొదలైనవి కూడా కిడ్నీ స్టోన్‌కు కారణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. కిడ్నీలలో రాళ్లను తొలగించడానికి అనేక మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కిడ్నీలో రాళ్లను వదిలించుకోవడానికి అనేక ఇంటి నివారణలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక హోమ్ టిప్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు లక్షణాలు..
*. దిగువ వీపులో తీవ్రమైన నొప్పి.
*. విపరీతమైన కడుపు నొప్పి
*. వాంతులు లేదా వికారం
*. జ్వరం
*. మూత్రంలో రక్తం
*. దుర్వాసనతో కూడిన మూత్రం
కిడ్నీ స్టోన్స్ అనేక పరిమాణాలలో వస్తాయి. చిన్న రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్తాయి. కొన్నిసార్లు పెద్ద రాళ్లు మూత్రంలో బయటకు వెళ్లడం కష్టంగా మారతుంది, దీనికి మందులు కొన్నిసార్లు శస్త్రచికిత్స అవసరం. కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లను ఇంటి నివారణలతో తొలగించవచ్చు.. ఈ రాళ్లను తొలగించడానికి మందారపు పువ్వు బేషుగ్గా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. దీని పొడిని నీళ్లతో కలిపి తీసుకుంటే కిడ్నీలో రాళ్లను సులభంగా దూరం చేసుకోవచ్చు.
రాత్రి భోజనం చేసిన గంటన్నర తర్వాత ఒక చెంచా మందార పూల పొడిని గోరువెచ్చని నీళ్లతో కలిపి తాగాలని వైద్యులు చెబుతున్నారు. మందార పూల పొడిని సేవించిన తర్వాత మూడు నాలుగు గంటల వరకు ఏమీ తినకూడదు.. మీకు విపరీతమైన జ్వరం, విపరీతమైన నొప్పి, మూత్రంలో రక్తం ఉంటే మీరు ఎలాంటి ఇంటి చిట్కాలు వాడకుండా డాక్టర్ ను సంప్రదించండి.. నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే సర్జరీ కూడా చేయించుకోవాల్సి వస్తుంది.. ఇక మందారం లో ఎన్నో పోషకాలు ఉన్నాయి.. జుట్టు, చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది..