health tips for children in winter
చలికాలం వచ్చిందంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికీ జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవుతాయి. సమస్యలని పెద్దవారు తట్టుకుంటారు కానీ పిల్లలు అంత త్వరగా తట్టుకోలేరు. అలాంటప్పుడు కొన్ని చిట్కాల ద్వారా సమస్యను త్వరగా తగ్గించవచ్చు. జలుబు వచ్చిందంటే చాలు ఒక పట్టాన వదలదు. దీనివల్ల ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడుతుంటారు. పెద్దలే సమస్యను భరించడం చాలా కష్టం. ఇక పిల్లలు ఎలా తట్టుకుంటారు? అందుకే సమస్యను భరించలేక ఏడుస్తూ ఉంటారు. అదే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని మందులు వేసినా పిల్లలకి త్వరగా జలుబు తగ్గదు. అలాంటప్పుడు కొన్ని ఇంటి చిట్కాలను వాడటం వల్ల త్వరగా జలుబు తగ్గుతుంది.
Read Also : Bigg boss 6: కెప్టెన్సీ ఓటింగ్… మీమాంసలో ఆ ఇద్దరూ!
పిల్లలకు జలుబు వచ్చిందంటే ముక్కు బ్లాక్ అయి, శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు పేరెంట్స్ వారికి విక్స్ లాంటివి రాస్తూ ఉంటారు. అయినప్పటికీ అంతగా ఎఫ్టెక్టీవ్‌గా ఉండదు. అలాంటప్పుడు ఆవిరి పట్టండి. దీనివల్ల పిల్లలకి త్వరగా ఉపశమనం కలుగుతుంది. దీనికోసం గిన్నెలో కొద్దిగా వేడినీరు తీసుకోండి. అందులో చిటికెడు పసుపు, నీలగిరి తైలం వేసి ఆవిరి పట్టించాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకి త్వరగా జలుబు తగ్గుతుంది. అయితే నీరు మరీ వేడిగా ఉండకూడదు. ఎందుకంటే పిల్లలు తట్టుకోలేరు.
Read Also : Spanish Paper: దుమారం రేపుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై స్పానిష్ పేపర్ కథనం
విశ్రాంతి అనేది చాలా అవసరం. దగ్గు, జలుబులతో పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే వారికి ఎక్కువగా నిద్ర పోనివ్వండి. ఇలా చేయడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. జలుబు పిల్లలను అలసిపోయి ఎలా చికాకు కలుగజేస్తుంది? పిల్లలు హాయిగా విశ్రాంతిని తీసుకున్నప్పుడు వారిని ఇబ్బంది పెట్టె జలుబు త్వరగా తగ్గుతుంది. కాబట్టి ఈ సమయంలో పిల్లలకి ఎక్కువ విశ్రాంతి అవసరం. విషయాన్ని తల్లితండ్రులు గుర్తు పెట్టుకోవాలి. రోజు కంటే ఎక్కువ సమయం వారు నిద్రపోయే ఎలా చూసుకోవాలి. దీనితో చాలా వరకు సమస్య తగ్గుతుంది.
Read Also : Womens Asia Cup : కప్ మనదే.. ఫైనల్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం
వేడినీటితో స్నానం చలి వాతావరణం జలుబు ఎక్కువ అయ్యేలా చేస్తుంది. కాబట్టి పిల్లలు ఉండే ప్రాంతం తేమగా కాకుండా ఉష్ణోగ్రత వేడిగా ఉండేలా చూసుకోండి. ఇలాంటి వాతావరణంలో ఉంటే త్వరగా జలుబు తగ్గుతుంది. పసుపు, పాలు వేడి పాలలో చిటికెడు పసుపు వేసి తాగిస్తే పిల్లలకు జలుబు నుంచే వెంటనే ఉపశమనం ఉంటుంది. కాబట్టి రోజు రాత్రి పడుకునే ముందు పిల్లలకు పాలల్లో పసుపు వేసి తాగించండి. దీనివల్ల మంచి ఉపశమనం ఉంటుంది. అదేవిధంగా మిరియాల పాలు కూడా పిల్లలకి ఉపశమనాన్ని ఇస్తాయి. అయితే కొంతమంది పిల్లలు ఘాటు ని తట్టుకోలేరు కాబట్టి ఈ విషయాన్ని గమనించి పిల్లలకు పాలు తాగించడం.
Read Also : ఈ మందులు శృంగార సామర్థ్యాన్ని తగ్గించొచ్చు.. జర జాగ్రత్త!
పిల్లల వయస్సు ఎక్కువగా ఉంటే సెలైన్ డ్రాప్స్ ద్వారా ముక్కుని క్లీన్ చేయొచ్చు. రెండు కప్పుల నీటిలో చిన్న అల్లం ముక్క, దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. ఇలా మరిగిన నీటిలో తేనె కలిపి పిల్లలతో తాగించాలి. అదేవిధంగా పిల్లలు అదే పనిగా దగ్గుతూ ఉంటారు. అలాంటి సమయంలో ఎలాంటి ఇంగ్లీష్ మందులు పనిచెయ్యవు. అప్పుడు కాసింత వాముని మెత్తగా దంచి చిటికెడు పరిమాణంలో తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు త్వరగా జలుబు తగ్గుతుంది.
అదేవిధంగా జలుబును తగ్గించడంలో తులసి కూడా బాగా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలకి తులసి ఆకులతో టీ పెట్టి తాగించాడు. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొద్దిగా దాల్చిన చెక్క పొడి, తేనెలను వేసి బాగా కలిపి తాగించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా జలుబు తగ్గుతుంది. యూకలిప్టస్ నూనె వాడటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ నూనెతో పిల్లల తల, ముక్కు, ఛాతీ భాగంలో బాగా మర్దన చేయడం వల్ల జలుబు త్వరగా తగ్గుతుంది. ఈ నూనెను అప్పుడప్పుడు వాసన చూపించడం వల్ల కూడా మంచి ఉపశమనం ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు వాసన చూపించడం మంచిది.