Spanish Paper: భారత ఆర్థిక వ్యవస్థపై స్పెయిన్ కు చెందిన ప్రధాన పత్రిక అవమానకర కథనం కలకలం రేపుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థపై “ది అవర్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ” అనే ఆర్టికల్ కి పాము వాటిని ఆడించే వ్యక్తి ఫోటోతో ఈ కథనం ప్రచురించారు. అక్టోబర్ 9న వీక్లీ పత్రిక మొదటిపేజీలో ఈ కార్టూన్ ప్రచురితమైంది. ఇది దేశంపై జాతి విద్వేషాన్ని వెళ్ల గక్కడం తప్ప మరొక్కటి కాదంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
Read Also: Amul Milk: సామాన్యుడికి షాక్.. గుజరాత్ మినహా దేశవ్యాప్తంగా పెరిగిన అమూల్ పాల ధరలు
జీరోదా వ్యవస్థాపకుడు అండ్ సీఈఓ నితిన్ కామత్ ట్విట్టర్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్ ‘అభ్యంతరకరమైన’ చర్చకు దారితీసింది. “ప్రపంచం గమనించడం చాలా బాగుంది, కానీ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే పాము వాటిని ఆడించే వ్యక్తి సాంస్కృతిక వ్యంగ్య చిత్రణ అవమానకరమైనది. ఇది ఆపడానికి ఏం అవసరమో ; బహుశా గ్లోబల్ ఇండియన్ ఉత్పత్తులేనా ? అంటూ కామత్ క్యాప్షన్‌లో రాశారు.
Read Also: Jammu Kashmir: కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. కాశ్మీర్ పండిట్ హత్య
దీనిపై బెంగుళూరు ఎంపీ పీసీ మోహన్ సీరియస్ గా స్పందించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్ధాల తర్వాత కూడా తమను పామును ఆడించే వాళ్లుగా చూపడం మూర్ఖత్వమేనంటూ మండిపడ్డారు. అంతేకాదు బలమైన ఆర్థిక వ్యవస్థగా ఇండియాకు గుర్తింపు ఉందన్నారు. మరోవైపు రచయిత రజత్ సేథి కూడా దీనిపై స్పందించారు. భారత ఆర్థిక వృద్ధిని ప్రపంచం గమనిస్తోంది.. జాత్యహంకార వ్యంగ్యం చిత్రాలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ 11న, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 2022లో భారతదేశ ఆర్థిక వృద్ధిని 6.1 శాతంగా అంచనా వేసింది, ఇది ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో అత్యధికం. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా భారతదేశ ఆర్థిక వృద్ధిని ప్రశంసించారు.