Health Crisis In Srilanka: శ్రీలంకలో ఆరోగ్య సంక్షోభం.. హస్పటల్స్కి తాళాలు
- శ్రీలంకలో తీవ్రమైన ఆరోగ్య సంక్షోభం.. దేశం విడిచి పారిపోతున్న వైద్యులు..
- ఇప్పటికే శ్రీలంక వ్యాప్తంగా మూతపడిన 100 ఆస్పత్రులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Crisis In Srilanka: పొరుగు దేశం శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తర్వాత ఇప్పుడు ఆరోగ్య సంక్షోభం తీవ్రమైంది. గత రెండేళ్లలో మొత్తం వైద్యుల జనాభాలో 10 శాతం (1700 మంది) వైద్యులు దేశం విడిచి పారిపోయిన పరిస్థితి ఏర్పాడింది. శ్రీలంక వైద్యులు దేశం విడిచి వెళ్లడంతో ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలిపోయింది. కోవిడ్ నుంచి అన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటున్న శ్రీలంకలోని ప్రజలు చికిత్స కూడా పొందలేకపోతున్నారు. అయితే, రాజధాని కొలంబోకు ఈశాన్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనురాధపుర టీచింగ్ హాస్పిటల్‌లోని పిల్లల వార్డును వైద్యుల కొరత కారణంగా క్లోజ్ చేశారు. కొలంబోకు ఆనుకుని ఉన్న మరో ఆసుపత్రిలో, అనస్థీషియా విభాగంలో వైద్యుల కొరతతో అన్ని రకాల ఆపరేషన్లు, ఎమర్జెన్సీ కేసులు వాయిదా పడ్డాయి. దేశవ్యాప్తంగా 100కి పైగా ఆసుపత్రులు మూసివేత అంచున ఉన్నాయనే విషయాన్ని అల్ జజీరా యొక్క నివేదికలో శ్రీలంక ఆరోగ్య మంత్రి రమేష్ పతిరానా తెలిపారు.
Read Also: Bihar Political Crisis : బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ(వీడియో)
Also Read
- Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
- CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
- Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు...
- UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
ఇక, శ్రీలంకను విడిచిపెట్టి విదేశాలకు వెళ్తున్న వైద్యులు తమకు దేశంలో డబ్బు, గౌరవం లభించడం లేదని ఆరోపిస్తున్నారు. పైగా, అధిక ద్రవ్యోల్బణం కారణంగా వారు క్లిష్ట పరిస్థితుల్లో జీవించవలసి ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో వైద్యులు ఇప్పుడు తమ భవిష్యత్త్, పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు.. అందుకే వారు దేశం విడిచి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అని వెల్లడైంది. కాగా, కోవిడ్ మహమ్మారి తర్వాత శ్రీలంక ఆర్థిక వ్యవస్థ పూర్తి సంక్షోభంలో చిక్కుకుంది. అ దేశ ప్రజలు ఆహారం, మందులు, ఇంధనం లాంటి అనేక ఇతర నిత్యావసర వస్తువుల కోసం గంటల తరబడి క్యూలలో నిరీక్షించవలసిన పరిస్థితి ఏర్పాడింది. దీనికి వైద్యులు మినహాయింపు కాదు.. కానీ వైద్యులు ప్రత్యేక ఇంధన కోటా కోసం అభ్యర్థించడంతో.. ప్రజా వ్యతిరేకత చెలరేగింది. ప్రస్తుతం శ్రీలంక వైద్యులు అధిక ద్రవ్యోల్బణం, ఇంధన కొరత, ఔషధాల కొరత, ఆహార కొరతను సైతం ఎదుర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Vedant Madhavan: ప్రౌడ్ ఫాదర్ మూమెంట్.. ఏషియన్ గేమ్స్ బరిలో మాధవన్ కుమారుడు!
-
Garba Row: గర్బాలో ముస్లింల ఎంట్రీపై వివాదం.. నుదిటిపై తిలకం తప్పనిసరి!
-
CM Chandrababu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసరాల ధరల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక యాక్షన్ ప్లాన్..
-
Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
-
Botsa Satyanarayana: 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాం.. ఒకరు పోతే వంద మంది వస్తారు…
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!