Site icon NTV Telugu

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర గర్భగుడిని చూశారా?.. రామయ్య కొలువుదీరేది ఇక్కడే..!

Ram Mandir

Ram Mandir

కోట్లాది భారతీయ రామభక్తుల కల అయోధ్యలో రామమందిర నిర్మాణంతో సాకారం కాబోతోంది. ఇప్పుడు శ్రీరాముడి విగ్రహం ఆలయం రూపుదిద్దుకుంటుంది. మరి కొన్ని నెలల్లో రాముడు తన ఆలయంలో కొలువు తీరనున్నాడు. అయితే.. దేవుడి దర్శనం కోసం వెళ్లే ప్రదేశంలో రామ మందిరం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలను ఏర్పాటు చేశారు. ఈ స్తంభాలపై శిల్పాలు కనబడతాయి. కళాకారులు ప్రస్తుతం స్తంభాలపై విగ్రహాలను చెక్కుతున్నారు. కళాకారులు పూర్తి ఏకాగ్రతతో స్తంభాలపై విగ్రహాలను చెక్కుతున్నారు. ఆలయ ప్రారంభం కోసం రోజులు దగ్గర పడుతుండటంతో పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని ఆలయ కమిటీ చెబుతుంది.

Read Also: Malla Reddy: కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే, చీకటి రోజులు వస్తాయి.. మల్లారెడ్డి హాట్ కామెంట్స్

అయోధ్యలో నిర్మించే రామమందిరాన్ని ప్రత్యేక రాళ్లతో నిర్మిస్తున్నారు. ప్రతి రాయిపై అద్భుతమైన శిల్పాలను చెక్కుతున్నారు. ఇక్కడి అద్భుతమైన కళాకారులు ఈ రాళ్లకు ప్రాణం పోస్తున్నారని చెప్పొచ్చు. తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు చెందిన అనిల్ మిశ్రా.. ప్రతి రాయిపై ఇలాంటి శిల్పాలు చెక్కడం చూడదగినవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ చిత్రాలను చూసేందుకు రామ భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన వెల్లడించార. అయితే, ఈ రామమందిర స్తంభాలపై పలు చోట్ల నిర్మాణంలో కాషాయ జెండా కూడా కనిపిస్తుంది. రాంలాలా స్వామి నివసించే గర్భగుడి ఇది.. ఈ గర్భగుడి వెడల్పు దాదాపు 20 అడుగులు ఉంటుంది.

Read Also: PV Sindhu: షట్లర్ మహ్మద్ హఫీజ్ హషీమ్‌ను తన కొత్త కోచ్‌గా ప్రకటించిన పివీ సింధు..

ఆలయం మొదటి దశలో దాదాపు 167 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాలు పింక్ ఇసుకరాయితో తయారు చేశారు. ఈ స్తంభాలపై దేవతామూర్తుల విగ్రహాలను చెక్కారు. ఈ స్తంభాలపై నర్తకి, హనుమంతుడు, వానర్ సేన , శివుని విగ్రహాలు చెక్కబడ్డాయని కళాకారులు తెలిపారు. ఈ చిత్రాలలో నిలబడి ఉన్న భారీ స్తంభాలను చూస్తే చూడముచ్చటగా ఉంటుంది. ఈ స్తంభాల గుండా వెళ్లే రహదారి కూడా కనబడుతుంది. గర్భగుడి చుట్టూ నిర్మించిన వృత్తాకార మార్గం.. రాంలాలా ఈ గర్భగుడిలో కూర్చున్న తర్వాత, రామ భక్తులు ఈ మార్గం గుండా రాముడిని దర్శించుకుంటారు.

Exit mobile version