సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం కుదిపేసింది. కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలు బయటకు రాగానే.. దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం బయటకు పడగానే ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. సిట్ లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చింది.
ఇది కూడా చదవండి: Challenge Vote: మీ ఓటును వేరే వాళ్లు వేశారా?.. అయితే ఇలా చేయండి!
తాజాగా ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు, నేతలకు కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర కీలక సూచనలు చేశారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఎవరూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు కానీ, సమాచారం షేర్ చేయడం కానీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజల్వ్‌ను వెనక్కి రప్పించేందుకు దర్యాప్తు బృందం సిట్ విదేశాలకు వెళ్లడం లేదని చెప్పారు. అతనికి సంబంధించిన సమాచారాన్ని ఇంటర్ పోల్ పంచుకుంటుందని తెలిపారు.
ఇది కూడా చదవండి: Thunderstorm : మెదక్ జిల్లాలో విషాదం.. పిడుగుపడి తండ్రికొడుకులు మృతి
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజల్వ్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఇటీవల పలు వీడియోలు వెలుగుచూడటం కర్ణాటక రాజకీయాలను కుదిపేసింది. బీజేపీ-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా ప్రజ్వల్ పోటీ చేసిన హాసన్ లోక్‌సభ నియోజకవర్గంలో ఏప్రిల్ 26న పోలింగ్ జరుగగా.. ఆ మరుసటి రోజే ఆయన విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసుపై సిట్ దర్యాప్తు చేపట్టడం, ప్రజ్వల్‌కు నోటీసులు ఇవ్వడం, ఆయన గడువు కోరడంతో సిట్ లుకౌట్ నోటీసులు జారీ చేసింది. అనంతరం బ్లూ కార్నర్ నోటీసులు కూడా దర్యాప్తు సంస్థ జారీ చేసింది.
ప్రజ్వల్‌ను రప్పించేందుకు విదేశాలకు సిట్ వెళ్లడం లేదని, బ్లూ కార్నర్ నోటీసు ఇచ్చినందున ప్రజ్వల్ ఎక్కడ కనిపించినా సంబంధిత దేశాలు ఇంటర్‌పోల్‌కు సమాచారం ఇస్తాయన్నారు. వారి ద్వారా తమకు సమచారం అందుతుందని హోం మంత్రి పరమేశ్వర తెలిపారు. అయితే ఇంతవరకూ తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉన్నందున, అది పూర్తయ్యేంత వరకూ ఎలాంటి సమాచారం బహిర్గతం చేయలేమని అన్నారు. సున్నితమైన కేసు అయినందున ప్రజలు, నేతలు సైతం బహిరంగ ప్రకటనలు ఇవ్వరాదని సూచించారు. అలా చేస్తే వారిని కూడా విచారణ ముందుకు రప్పించి వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేస్తామన్నారు.
ఇది కూడా చదవండి: BSNL Recharge Plans: బీఎస్‌ఎన్‌ఎల్‌లో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్!