Challenge Vote: మీ ఓటును వేరే వాళ్లు వేశారా?.. అయితే ఇలా చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do You Know How To Cast Tender Vote: ఎన్నికల సమయంలో కొందరి ఓటర్ల పేర్లు జాబితాలో మిస్ అవ్వడం, మరికొందరు ఇతరుల పేరుతో దొంగ ఓట్లు వేయడం జరుగుతూనే ఉంటుంది. ఓటరు లిస్ట్‌లో పేరు లేకపోతే చాలా మంది నిరాశ చెందుతారు. అయితే తమ ఓటును మరొకరు వేస్తే.. చాలా మందికి ఏం చేయాలో అర్ధం కాదు. అలాంటి వారు అస్సలు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీ ఓటును మరొకరు వేసినా.. మీరు మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఇందుకు పరిష్కారమే సెక్షన్ 49(పి). భారత ఎన్నికల సంఘం (ఈసీ) 1961లో సెక్షన్ 49(పి)ను అమల్లోకి తెచ్చింది. దీనిపై తమిళ హీరో విజయ్.. సర్కార్ సినిమాలో న్యాయపోరాటం చేసి తన ఓటు హక్కు దక్కించుకుంటాడు.
పోలింగ్ రోజు మీ ఓటును వేరే వారు వేశారని తెలిస్తే.. సెక్షన్ 49(పి) ద్వారా మీరు ఓటు పొందొచ్చు. దీనికోసం ముందుగా ప్రిసైడింగ్ అధికారిని కలవాలి. ఓటు కోల్పోయిన వ్యక్తి తానే అని ఆయన ముందు నిరూపించుకోవాలి. ఇందుకు ఓటరు గుర్తింపు కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులను సమర్పించాలి. ఎన్నారైలు అయితే పాస్‌పోర్టు కూడా చూపించొచ్చు. ఆపై ప్రిసైడింగ్ అధికారి ఇచ్చే ఫామ్ 17(బి)లో పేరు, సంతకం చేసి ఇవ్వాలి. అనంతరం టెండర్ బ్యాలెట్ పేపర్‌ను ప్రిసైడింగ్ అధికారి ఓటు కోల్పోయిన వ్యక్తికి ఇస్తారు. బ్యాలెట్ పేపర్‌పై నచ్చిన అభ్యర్థికి ఓటేసి.. మరలా ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. ఆయన ఆ బ్యాలెట్ పేపర్‌ను ప్రత్యేక కవర్‌లో భద్రపరిచి.. కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. ఇలా మీరు మీ ఓటు హక్కును వినియోగించుకున్నట్లే.
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
Also Read: BSNL Recharge Plans: బీఎస్‌ఎన్‌ఎల్‌లో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్!
అయితే సెక్షన్ 49(పి) ద్వారా పొందే ఓటు హక్కును ఈవీఎం ద్వారా వేసేందుకు ఎలక్షన్ అధికారులు అనుమతివ్వరు. 49(పి) సెక్షన్ ద్వారా పొందే ఓటు హక్కును టెండర్ ఓటు, ఛాలెంజ్ ఓటు అని అంటారు. నిజానికి ఎన్నికల్లో 49(పి)ని వినియోగించుకున్న వారు చాలా తక్కువ అట. చాలా ప్రాంతాల్లో 49(పి) గురించి ఎక్కువగా తెలియకపోవడమే ఇందుకు కారణం అట. అందుకే ఎలక్షన్ అధికారులే చొరవ తీసుకుని అందరికి అవగాహన కల్పించాలి.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!