Bachchalamalli : ‘బచ్చల మల్లి’ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది ?
- థియేటర్లో డీసెంట్ టాక్ తెచ్చుకున్న బచ్చలమల్లి
- మరోసారి డిఫరెంట్ సబ్జెక్ట్ తో వచ్చిన అల్లరోడు
- అమెజాన్ ప్రైమలో 9నుంచి స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bachchalamalli : కామెడీ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న అల్లరి నరేష్, డిఫరెంట్ జానర్ చిత్రాలతోనూ అలరిస్తున్నారు. విజయ్ కనక మేడల దర్శకత్వంలో నటించిన ‘ నాంది’ సినిమాతో అల్లరి నరేష్ తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన బెట్టి కథబలం ఉన్న సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. అలా చేస్తూనే హిట్స్ కూడా అందుకుంటున్నాడు అల్లరి నరేష్. మొన్నమధ్య తన ఓల్డ్ ఫార్మేట్ లో ఆ ఒక్కటి అడక్కు అని సినిమా చేసి ప్లాప్ చూశాడు. దాంతో ఈ సారి ఎలాగైన హిట్టు కొట్టాలి అని మరోసారి సీరియస్ సబ్జెట్ తో బచ్చల మల్లి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేష్. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also:Mallu Bhatti Vikramarka: వరంగల్ జిల్లాలో పర్యటించనున్న డిప్యూటీ సీఎం
Also Read
- Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
- Killer Wife: ప్రియుడి మోజులో పడి ఏం మర్డర్ స్కెచ్ వేసింది.. భర్తను పొలానికి పిలిచి..!
- Best Batting Pair: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కాదు.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్ జోడి ఇదే..
- Tamil Nadu: ఇదేం పద్ధతి? బాలిక హత్య కేసు ప్రెస్మీట్లో పోలీసులు వెకిలి నవ్వులు.. వీడియో వైరల్
‘బచ్చల మల్లి’ రిలీజ్‌కు ముందు మంచి అంచనాలను క్రియేట్ చేసింది. అల్లరి నరేష్ నుంచి వస్తున్న మరో సీరియస్ మూవీ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. అయితే, ఈ సినిమా రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది. దీంతో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్కు తీసుకొచ్చేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రముఖ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘బచ్చల మల్లి’ మూవీ జనవరి 9 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాను థియేటర్లో మిస్ అయినవారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తారని మేకర్స్ భావిస్తున్నారు. ఈ సినిమాలో అందాల భామ అమృతా అయ్యర్ హీరోయిన్గా నటించారు. మరి ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది.
Read Also:Daaku Maharaj : డాకూ మహారాజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం.. భారీగా తరలి వచ్చిన అభిమానులు
తాజావార్తలు
-
Master Plan: ఊరి జనాల్ని నమ్మించి.. మాస్టర్ స్కెచ్ వేశారు.. రూ.కోటితో పరార్..
-
Ratna Debnath: ‘నేను నా కూతురిని కోల్పోయా.. ఆమె తన కుర్చీని కోల్పోయింది’.. మమతపై ఆర్జీ కార్ బాధితురాలి తల్లి విమర్శలు
-
Hyderabad: కంత్రీగాడి తాటతీసిన పోలీసులు.. వీడిన నార్సింగ్ మహిళపై వేధింపుల కేసు
-
OTR : హైదరాబాద్ FSL లో అగ్నిప్రమాదం.. మేడిగడ్డ ఫైళ్లు తగలబడటం వెనుక రహస్యం ఏంటి?
-
Zepto: దలాల్ స్ట్రీట్‌లో క్విక్ కామర్స్ జాతర.. రూ.11 వేల కోట్ల ఐపీఓకు జెప్టో రెడీ!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?