సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలన్నారు. వ్యతిరేక ఓట్లు చీలకూడదంటే విపక్షాలన్నీ ఏకధాటిపైకి రావాలనుకున్నాయి. అంతే తడువుగా ఆయా రాజకీయ పక్షాలు ఏకతాటిపైకి వచ్చి ఇండియా కూటమిగా ఏర్పాడ్డాయి. అంతేకాదు ఆయా రాష్ట్రాల్లో సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించుకున్నాయి. సీట్లు సర్దుబాటు.. క్యాంపెయిన్, తదితర అంశాలపై బాగానే మేథోమదనం చేశాయి. ప్రజల్లో ఒక విధమైన సానుకూల పవనాలు కూడా వీచాయి. ఇంతలో కూటమి తీసుకున్న ఓ నిర్ణయం ఒక్క కుదుపు కుదిపి మూడు ముక్కలైపోయేటట్టుగా చేసింది. అంతే దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుని పువ్వు పార్టీ వేసిన స్కెచ్ ఫలించడంతో కమలనాథులు విక్టరీ మూడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు.
YCP: ఉదయం నుంచి సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టిన నేతలు..
పదేళ్ల నుంచి దేశంలో బీజేపీ అధికారం చెలాయిస్తోంది. మరోసారి మోడీ సారథ్యంలో సార్వత్రిక ఎన్నికలు వెళ్తేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. మూడోసారి కూడా విజయం మాదేనని ప్రధాని మోడీ కంఠపదంగా చెబుతున్నారు. దీంతో మరోసారి కమలానికి అవకాశం ఇవ్వకూడదని విపక్ష పార్టీలు భావించాయి. ఒంటరిగా బరిలోకి దిగితే ఓటమి చవిచూడాల్సి వస్తుందని.. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే ప్రతిపక్ష పార్టీలన్నీ ఒక్కతాటికి రావాలని అనుకున్నాయి. అనుకున్న తడువుగా ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత అక్కడకక్కడ సమావేశాలు పెట్టి భవిష్యత్ కార్యాచరణపై కూడా చర్చించాయి. కానీ ఇంతలోనే కూటమి సభ్యులు తీసుకున్న ఓ నిర్ణయం మనస్పర్థలకు దారి తీసి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా అయిపోయింది.
Delhi Horror: కత్తితో బెదిరించి.. 14 ఏళ్ల బాలుడిపై స్నేహితులు అసహజ లైంగిక దాడి
ఇటీవల ఇండియా కూటమి అధ్యక్షుడిగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జన ఖర్గేను తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు బలపర్చగా.. ఆర్జేడీ అధినేత లాలూ, ఎస్పీ అధినేత అఖిలేష్, ఆప్, శివసేన తదితర పార్టీలన్నీ మద్దతు తెలిపాయి. ఈ పరిణామం జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్‌ను తీవ్రంగా నొచ్చుకునేలా చేసింది. ఇంకోవైపు సీట్ల సర్దుబాటు అంశం రోజు రోజుకు లేటు అయ్యేకొద్దీ ఆయా పార్టీల్లో అసహనం కూడా మొదలైంది. ఇంతలో తృణమూల్ కాంగ్రెస్.. ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. అనంతరం ఆప్ కూడా తాము కూడా ఒంటరిగానే బరిలోకి దిగుతామని వెల్లడించింది. ఇలా ఇండియా కూటమిలో జరుగుతున్న ఒడుదొడుకులను గమనించిన కాషాయ పార్టీ.. నితీష్‌కు బాణం వేసింది. అప్పటికే అసంతృప్తితో రగిలిపోతున్న నితీష్.. బీజేపీ వేసిన గాలంలో చిక్కుకుని కూటమి ముక్కలయ్యేలా చేశారు. అంతే ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టుగా కమలం వేసిన వ్యూహం ఫలించింది.
