పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో @Travel with JO పేరుతో ఖాతా ఉంది. ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు, రీల్స్‌ను పోస్ట్ చేసింది. పాకిస్థాన్ లో రూపొందించిన రీల్స్, వీడియోల ద్వారా పాక్‌లో సానుకూల అంశాలను చూయించడానికి ప్రయత్నించింది. పాకిస్థాన్‌లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయంటూ.. ప్రచారం చేసింది. జ్యోతి పాకిస్థాన్ వెళ్లి అక్కడి అనార్కలి మార్కెట్‌ను వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఆహార పదార్థాలు, సంస్కృతి, అనేక ఇతర కార్యకలాపాలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. అయితే.. ఈ విషయం మొత్తం బయటకు రావడంతో ప్రస్తుతం ఆమెపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. పాకిస్థాన్‌పై ఎందుకంత ప్రేమ అంటూ తిట్టిపోస్తున్నారు.
READ MORE: Minister Seethakka: ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇచ్చినా.. కాంట్రాక్టర్లు ముందుకు వస్తలేరు
అయితే.. న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ ఉద్యోగి ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో జ్యోతి మల్హోత్రా పరిచయాలు పెంచుకుంది.
డానిష్‌ను ప్రభుత్వం ఇటీవేల బహిష్కరించిన విషయం తెలిసిందే. డానిష్ గురించి వివరాలన్నీ బయటకు లాగడంతో జ్యోతి గురించి వెలుగులోకి వచ్చింది. పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లకు (PIO) డానిష్.. జ్యోతి మల్హోత్రాను పరిచయం చేసినట్లు తేలింది. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్ట్ చేసిన ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌లతో నిత్యం టచ్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. ఈ ప్లాట్‌ఫామ్స్ ద్వారానే భారత్‌కు చెందిన కీలక సమాచారాన్ని పాక్ అధికారులకు చేరవేసినట్లు తెలిసింది. ‘జాట్ రంధావా’ అని సేవ్ చేసుకున్న ఓ పేరు షకీర్ అలియాస్ రాణా షాబాజ్ అనే పాకిస్థాన్ వ్యక్తిదిగా అధికారులు గుర్తించారు.
READ MORE: India Pakistan: భారత్ క్షిపణులతో దాడి చేసింది.. రాత్రి 2.30కి పాక్ ప్రధానికి ఆసిమ్ మునీర్ ఫోన్..
