Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో నంద్యాలకు చెందిన యూట్యూబ్ విలేఖరి అల్లాబకాష్ కీలక పాత్ర ఉన్నట్లు పోలీసుల తేల్చారు. ఎక్సైజ్ అధికారులు అల్లాబకాష్‌ను అరెస్ట్ చేసి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అల్లాబకాష్ స్వగ్రామం గోస్పాడు (మం) జిల్లెళ్ళ. 20 ఏళ్లపాటు హైదరాబాద్‌లో చిన్న ఉద్యోగాలు చేసిన అతడు.. ఏడాది క్రితం నంద్యాలకు వచ్చి, యూట్యూబ్ ఛానల్‌ను క్రియేట్ చేసుకుని విలేకరిగా చలామణి అవుతున్నాడు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత, నటుడు విజయ్ కరూర్‌లో నిర్వహించిన ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటపై నకిలీ వార్తలు ప్రచారం చేసిన యూట్యూబర్ ఫెలిక్స్ జెరాల్డ్‌ను తమిళనాడు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెడ్‌పిక్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్న జెరాల్డ్.. కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఫేక్ కంటెంట్‌ను తన ఛానల్‌లో ప్రచారం చేశారు. టీవీకే పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్నాడని ఫిర్యాదులు అందడంతో పోలీసులు అతడిని…
Youtuber : రాజస్థాన్‌లోని జైపూర్ నగరంలో యూట్యూబ్ పాపులారిటీ కోసం ఓ యువకుడు అనుచితంగా ప్రవర్తించాడు. పవిత్రమైన నిర్జల ఏకాదశి రోజున యూట్యూబ్ ఫేమ్ కోసం బీర్ బాటిళ్లు ఉచితంగా పంచుతూ వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మతభావనలు దెబ్బతీసేలా ఉన్న ఈ చర్యపై చర్య తీసుకున్న పోలీసులు అతనితో పాటు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. జైపూర్‌కు చెందిన లప్పు సచిన్ అలియాస్ సచిన్ సింగ్…
పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో @Travel with JO పేరుతో ఖాతా ఉంది. ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు, రీల్స్‌ను పోస్ట్ చేసింది. పాకిస్థాన్ లో రూపొందించిన రీల్స్, వీడియోల ద్వారా పాక్‌లో సానుకూల అంశాలను చూయించడానికి ప్రయత్నించింది. పాకిస్థాన్‌లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయంటూ..
మేడ్చల్ జిల్లాఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగురోడ్డుపై మనీ హంట్ ఛాలెంజ్ పేరుతో డబ్బులు వెదజల్లుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్న భానుచందర్ అనే యూట్యూబర్‌ను ఘట్‌కేసర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని రిమాండ్‌కు తరలించారు.
Salman Khan : బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) పై బెదిరింపులకు సంబంధించిన హై ప్రొఫైల్ కేసులో ముంబై పోలీసుల క్రైమ్ బ్రాంచ్ గణనీయమైన పురోగతి సాధించింది. ‘ఆర్ ఛోడో యార్’ ఛానెల్లో యూట్యూబ్ వీడియో ద్వారా నటుడిని బెదిరించినందుకు రాజస్థాన్ కు చెందిన 25 ఏళ్ల బన్వరిలాల్ లతుర్లాల్ గుజర్ ను అరెస్టు చేశారు. ఖచ్చితమైన సాంకేతిక దర్యాప్తు ద్వారా సాధ్యమైన ఈ అరెస్టు, నేరపూరిత బెదిరింపుల నుండి ప్రముఖులను రక్షించడంలో…