పాకిస్థాన్ తరఫున గూఢచర్యం చేసిందనే ఆరోపణలపై హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతికి ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో @Travel with JO పేరుతో ఖాతా ఉంది. ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన అనేక వీడియోలు, రీల్స్‌ను పోస్ట్ చేసింది. పాకిస్థాన్ లో రూపొందించిన రీల్స్, వీడియోల ద్వారా పాక్‌లో సానుకూల అంశాలను చూయించడానికి ప్రయత్నించింది. పాకిస్థాన్‌లో చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయంటూ..
పాకిస్థాన్ దేశానికి, సైన్యానికి కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్‌తో సహా ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నెట్‌వర్క్ హర్యానా, పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. వీరు పాక్ ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారు. నిందితుల్లో "ట్రావెల్ విత్ జో" అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న జ్యోతి మల్హోత్రా కూడా ఉంది. ఆమె కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా పొంది.. 2023లో పాకిస్థాన్ సందర్శించినట్లు అధికారులు వెల్లడించారు. ఆమె పర్యటన సందర్భంగా..…