Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Haryana Bans Hookah In Bars And Restaurants Government To Target Supply Chain

Hookah Ban: హుక్కాప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఇకపై రెస్టారెంట్లు, హోటళ్లలో నిషేధం

Published Date :September 26, 2023 , 7:11 pm
By Mahesh Jakki
Hookah Ban: హుక్కాప్రియులకు బ్యాడ్‌న్యూస్..  ఇకపై రెస్టారెంట్లు, హోటళ్లలో నిషేధం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Haryana: హర్యానా ప్రభుత్వం హుక్కా ప్రియులకు చేదువార్త అందించింది. హర్యానాలోని హోటళ్లు, బార్‌లు, రెస్టారెంట్లలో ఇకపై హుక్కాను ప్రభుత్వం నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు హుక్కా అందించడాన్ని నిషేధిస్తున్నట్లు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సోమవారం ప్రకటించారు.రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చడంలో ఇది ఒక ముఖ్యమైన చర్య అని అన్నారు. సోమవారం నాడు డీ-అడిక్షన్ ప్రచారానికి సైక్లోథాన్ ముగింపు కార్యక్రమంలో మనోహర్ ఖట్టర్ పాల్గొన్నారు. డ్రగ్స్‌ను అరికట్టాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

Also Read: PM Modi: గత 30 రోజుల్లో భారతదేశ దౌత్యం కొత్త శిఖరాలను తాకింది

25 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో సైకిల్‌ తొక్కిన పోలీసులను ప్రశంసిస్తూ.. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తామని ప్రకటించారు. ఇందులో పాల్గొన్న 250 మందికి హర్యానా డీజీపీ నుంచి క్లాస్-1 కమెండేషన్ సర్టిఫికెట్ లభిస్తుందని మనోహల్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఇందులో నిమగ్నమైన పోలీసులకు ఐదు రోజుల సెలవులు కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. సైక్లోథాన్‌ ముగిసినా డ్రగ్స్‌ బెడద ఇంకా అంతం కాలేదన్నారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా సమాజం ఏకం కావాలని ఆయన సమాజ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Also Read: Afghanistan: ప్రపంచంలో “అత్యుత్తమ కరెన్సీ పనితీరు”లో ఆఫ్ఘనిస్తాన్ టాప్.

రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లు, బార్‌లు, వాణిజ్య సంస్థల్లో వినియోగదారులకు ‘హుక్కా’ అందించడాన్ని నిషేధిస్తున్నట్లు హర్యానా ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అయితే, హర్యానా ప్రభుత్వ నిషేధం గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే సాంప్రదాయ హుక్కాలకు వర్తించదు. ఈ మేరకు సర్కారు ప్రకటించింది. హర్యానా అసెంబ్లీ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా వాణిజ్య సంస్థలు హుక్కా సేవలను నిలిపివేయాలని డిమాండ్ చేసిన కొన్ని నెలల తర్వాత ఈ నిషేధం వచ్చింది.ఈ విషయమై గుప్తా మే నెలలో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. బార్‌లు, క్లబ్‌లలో హుక్కా తాగడం “బర్నింగ్ ప్రాబ్లమ్” అని స్పీకర్ అభివర్ణించారు. దానిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్ ఖట్టర్ సెప్టెంబర్ 1న సైక్లోథాన్‌ను ప్రారంభించి సోమవారం (సెప్టెంబర్ 25) ముగించారు. 25 రోజుల పరుగులో సైక్లోథాన్ సుమారు 2,000 కిలోమీటర్లు ప్రయాణించింది.

Also Read: Gurpatwant Singh Pannun: ఇండియాను విభజించి అనేక దేశాలు చేయాలనుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాది..

కర్ణాటకలో ఇలా.,
కర్ణాటక ప్రభుత్వం హుక్కా బార్‌లను నిషేధించాలని, పొగాకు ఉత్పత్తులను కొనుగోలు చేసే కనీస వయస్సును 21 ఏళ్లకు పెంచాలని యోచిస్తున్నట్లు వారం క్రితం నివేదిక వెలువడింది. ఈ మార్పులను తీసుకురావడానికి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టాన్ని సవరించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. 12 ఏళ్ల నుంచి 25 ఏళ్ల యువకుల వరకు హుక్కా బార్లను సందర్శిస్తున్నారని, పొగాకు వినియోగం మానేయాలని, అందుకోసం చట్టం తీసుకురావాలని గుండురావు అన్నారు. ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి సమావేశమై, పాఠశాలలతో పాటు, దేవాలయాలు, మసీదులు, పిల్లల సంరక్షణ కేంద్రాలు, ఆసుపత్రుల చుట్టూ కూడా పొగాకు ఉత్పత్తుల అమ్మకం, వినియోగం నిషేధించబడింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bars
  • Haryana
  • Haryana Bans Hookah
  • Hookah Ban
  • Manohar Lal Khattar

తాజావార్తలు

  • Hyderabad: హైకోర్టు జోన్‌-2 పనులకు శంకుస్థాపన..!

  • RCB vs CSK Playing 11: ఫామ్‌లో ఆర్‌సీబీ, సీఎస్‌కేకు విజయం తప్పనిసరి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11 ఇదే!

  • Khawaja Asif: తినడానికి తిండి లేదు కానీ.. కోల్‌కతాపై దాడి చేస్తారట! పాక్ రక్షణ మంత్రి “బలుపు” మాటలు..

  • Rashmika Mandanna : రష్మిక బర్త్ డే స్పెషల్.. జయమ్మకు రణబాలి టీమ్ సర్ప్రైజ్ గిఫ్ట్

  • AP High Court: విదేశాలకు వెళ్లొచ్చిన అర్చకులకు అనుమతి లేదు.. అధికారులకు హైకోర్టు ఆదేశం!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions