రూ.15,999కే 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో Moto G67 Power 5G లాంచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moto G67 Power 5G: మోటరోలా తాజాగా Moto G67 Power 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మొబైల్ లో 7000mAh బ్యాటరీ, ఆధునిక ప్రాసెసర్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ వంటి ప్రత్యేక ఫీచర్లతో ఈ ఫోన్ కేవలం రూ.15,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. యువతను ఆకర్షించే స్టైలిష్ డిజైన్, పవర్‌ఫుల్ పనితీరు, దీర్ఘకాలిక బ్యాటరీ లైఫ్ ఈ ఫోన్ ప్రధాన హైలైట్‌లుగా నిలవనున్నాయి.
Bihar Elctions: రేపే బీహార్ తొలి విడత పోలింగ్.. బూత్‌లకు చేరుకుంటున్న సిబ్బంది
Also Read
- iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
- Red Magic 12 Pro+: 8400mAh బ్యాటరీతో Red Magic 12 Pro+ రిలీజ్.. 185Hz డిస్ప్లే, 100W ఛార్జింగ్‌తో అదుర్స్!
- WhatsApp Guest Calling Feature: WhatsApp కొత్త ఫీచర్.. అకౌంట్ లేకుండానే వీడియో కాల్స్‌లో చేరొచ్చు.. ఎలా వాడాలంటే?
- Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్ప్లే!
ఫోన్ పేరుకే తగ్గట్టుగా ఈ మొబైల్ ఒక పవర్‌హౌస్. 7000mAh పెద్ద బ్యాటరీ 3 రోజుల వరకు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ హామీ ఇస్తోంది. ఇక ఇది 33W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కల్పించబడింది. క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 (4nm) ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఇది 2.4GHz వరకు క్లాక్ స్పీడ్ అందిస్తుంది. ఇక ఇందులో 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్‌లో ‘RAM Boost’ ఫీచర్ ద్వారా వర్చువల్ ర్యామ్ ను 16GB వరకు పెంచుకోవచ్చు. ఇందులో 6.7 అంగుళాల FHD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1050 nits పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i అందించారు.

ఇక కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50MP Sony LYT-600 సెన్సార్‌తో కెమెరా, అలాగే 8MP అల్ట్రా వైడ్ + మ్యాక్రో లెన్స్ కలిపి ఉన్న డ్యుయల్ కెమెరా సెటప్ ఉంది. ఈ కెమెరా 4K 30fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో అందించబడింది. ఇది కూడా 4K వీడియోలను రికార్డ్ చేయగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15తో వస్తుంది. అలాగే ఆండ్రాయిడ్ 16 అప్‌డేట్‌తో పాటు 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లు అందించబడతాయి. డిజైన్ పరంగా ఇది వీగన్ లెదర్ ఫినిష్.. IP64 రేటింగ్ ద్వారా నీటి తుంపరలు, దుమ్ము నుండి రక్షణ కల్పిస్తుంది. ఇక ఈ మొబైల్ MIL-STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ పొందడంతో దీని మన్నిక అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది.
Sunrisers Leeds: జట్టు పేరును మార్చేసిన కావ్య మారన్.. కొత్త పేరేంటంటే..?
ఇతర ముఖ్య ఫీచర్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్, డాల్బీ అట్మోస్ స్టీరియో స్పీకర్లు, Wi-Fi 6, మరియు 5G కనెక్టివిటీ ఉన్నాయి. Moto G67 Power 5G ఒకే వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో లభిస్తుంది. ఇది పాంటోన్ సిలాంత్రో (Cilantro), పాంటోన్ కురాకో బ్లూ (Curacao Blue), పాంటోన్ పారాచూట్ పర్పుల్ (Parachute Purple) అనే మూడు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ విక్రయాలు నవంబర్ 12 నుండి ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్ సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో ప్రారంభమవుతాయి. ప్రారంభ ఆఫర్లలో SBI, Axis కార్డులపై రూ.1,000 బ్యాంక్ తగ్గింపు లేదా రూ.1,000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, అలాగే 3 లేదా 6 నెలల నో కాస్ట్ EMI సౌకర్యం లభిస్తుంది.
Power. Performance. Precision. ⚡
The all-new #motoG67POWER packs a 7000mAh Silicon-Carbon battery, 50MP Sony LYT-600 camera with 4K on all lenses, and Snapdragon® 7s Gen 2 power — all on a 6.7” 120Hz FHD+ display with Gorilla Glass 7i.
Launching Nov 5 at ₹14,999* on Flipkart. pic.twitter.com/qJiKvFAdP8— Motorola India (@motorolaindia) November 4, 2025
Blazing-fast performance. 4K video recording. All-day power.
Powered by the #Snapdragon 7s Gen 2, the all-new Moto G67 Power #5G is built to keep up with you 📱💪🏼 pic.twitter.com/MIXr4BT8o2
— Snapdragon India (@Snapdragon_IN) November 5, 2025
తాజావార్తలు
-
Telangana Inter Exam Fee : తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల..
-
Kim Jong Un: కిమ్ కొత్త క్షిపణి ప్రయోగం.. దడదడలాడిన దక్షిణ కొరియా!
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!