Harish Rao: మెదక్‌లో గుండాల రాజ్యం నడుస్తుందా? ప్రభుత్వ పాలన నడుస్తుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: 13 మంది బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో పెట్టారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. తాజాగా ఆయన సంగారెడ్డి సెంట్రల్ జైలు ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలవలేక అక్రమంగా తమ కార్యకర్తలని జైల్లో పెట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఓ సీటు ఎక్కువ బీఆర్ఎస్ గెలిచిందని చెప్పారు. మెదక్ ఎమ్మెల్యే రోహిత్15వ వార్డుకు అర్ధరాత్రి ఎందుకు వెళ్లారు? అని ప్రశ్నించారు. మైనారిటీ మహిళ ఛాతిపై ఎమ్మెల్యే గన్ మెన్ దాడి చేస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. మెదక్ డిఎస్పీ దగ్గరుండి కాంగ్రెస్ కార్యకర్తలతో డబ్బులు పంచే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేసులు పెట్టాల్సింది ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులపై కానీ అన్యాయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై కేసు పెట్టారని మండిపడ్డారు. ఆరుగురు ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని ఇది దారుణమన్నారు. గుడ్డిగా పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారన్నారు. ఇష్టారాజ్యంగా పోలీసులు వ్యవహరిస్తే రేపు మిమ్మల్ని శిక్షించక తప్పదని హెచ్చిరించారు. 4 కార్ల కాన్వాయ్ తో ఎమ్మెల్యే వస్తే ఆయనపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. వాహనాలు ఎందుకు సీజ్ చేయలేదని నిలదీశారు. ఎమ్మెల్యే కారు తన కాళ్లపై వెళ్లిందని బీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు చేస్తే పోలీసులు
ఎందుకు చర్యలు తోసుకోలేదని అడిగారు.
Also Read
- Fathers Day: వెన్నుతట్టి నడిపించే ధైర్యం ‘నాన్న’.. ఫాదర్స్ డే (జూన్ 21) సందర్భంగా బెస్ట్ కొటేషన్స్ మీ కోసం..
- IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా..
- Iran vs US: హర్మూజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ సంచలన ప్రకటన..
- Viral Divorce: పెళ్లి కోసం వయసు తగ్గించి చెప్పిన భర్త.. కోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకున్న భార్య..
బీఆర్ఎస్ కార్యకర్త ఆటో తగలబెట్టినట్టు ఆధారాలు ఉన్నా పోలీసులు గుండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదో డీజీపీ శివధర్ రెడ్డి సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. “ఖాకి బుక్కు అందరికి సమానం అని చెప్పే డీజీపీ శివధర్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. బీజేపీ నేత, కాంగ్రెస్ నేతలు పోలీసులను ఇష్టం వచ్చినట్టు తిడితే కేసులు ఎందుకు లేవు. ఖాకి బుక్కు కాంగ్రెస్ కి చుట్టం అయ్యిందా? క్యాతన్‌పల్లిలో సుమన్‌పై, ఆమన్‌గల్‌లో మా కార్యకర్తలపై కేసులు పెట్టారు. మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మా పోలింగ్ ఏజెంట్‌ని తిడితే కేసు ఎందుకు పెట్టలేదు. డీజీపీ శివధర్‌రెడ్డి నీ ఖాకీ బుక్కు పని చేస్తుందా లేదా? రాహుల్ గాంధీ రాజ్యాంగం బుక్కు తీసుకుని తిరుగుతారు.. మరి ఇది కనపడటం లేదా? రేవంత్ రెడ్డి పట్టపగలు రాజ్యాంగాన్ని ఖునీ చేస్తుంటే రాహుల్ గాంధీకి కనపడటం లేదా? 3 మున్సిపల్ ఛైర్మన్ల ఎన్నికలను ఎందుకు నిర్వహించడం లేదు. ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా? జనగాంలో మా కార్యకర్త చేయి ఎత్తితే కాంగ్రెస్ గుండాలు అడ్డుకున్నారు.. మున్సిపల్ ఎన్నికల్లో 800 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది.. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ 4 మున్సిపాలిటీలు కూడా గెలవలేదు.. నేడు మేము చాలా చోట్ల ఎక్కువ స్థానాలు గెలిచినా అధికారాన్ని అడ్డం పెట్టుకుని కుట్రలు చేశారు.. రైతు బంధు ఇంకా ఎప్పుడు వేస్తావ్ రేవంత్ రెడ్డి? రైతు బంధు ఇవ్వకపోతే ఇక ప్రత్యక్షంగా పోరాటం చేస్తాం. మెదక్‌లో కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కార్యకర్తలని బెదిరిస్తున్నారు.. మెదక్‌లో గుండాల రాజ్యం నడుస్తుందా..? ప్రభుత్వ పాలన నడుస్తుందా..? చట్టంపై గౌరవం దెబ్బతినేలా శివధర్ రెడ్డి వ్యవహారం ఉంది.” అని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Fathers Day: వెన్నుతట్టి నడిపించే ధైర్యం ‘నాన్న’.. ఫాదర్స్ డే (జూన్ 21) సందర్భంగా బెస్ట్ కొటేషన్స్ మీ కోసం..
-
IND Vs AFG: సెంచరీతో వీరవిహారం చేసిన యశస్వి జైస్వాల్.. క్లీన్‌స్వీప్ చేసిన టీమిండియా..
-
Iran vs US: హర్మూజ్ జలసంధి మళ్లీ మూత.. ఇరాన్ సంచలన ప్రకటన..
-
Beetroot and Sugar Gum: బీట్రూట్ + చూయింగ్ గమ్.. బీపీకి కొత్త ఫార్ములా.?
-
Viral Divorce: పెళ్లి కోసం వయసు తగ్గించి చెప్పిన భర్త.. కోర్టుకు వెళ్లి విడాకులు తెచ్చుకున్న భార్య..
ట్రెండింగ్
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!
-
Health Tips : షుగర్ కంట్రోల్‌కు నేరేడు గింజల చిట్కా..! ఇలా సింపుల్‌గా చేసుకోండి..!
-
Vaibhav Sooryavanshi: ఫైనల్లో వైభవ్‌ను టార్గెట్ చేస్తారా?.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర సమాధానం!