Harish Rao : సర్పంచ్‌లకు శుభవార్త చెబుతున్నాం.. ఏప్రిల్ 1 నుంచి నేరుగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంగారెడ్డి కులబ్ గుర్ లో దీనదయాళ్ జాతీయ పంచాయతీ 2021-22 అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, జడ్పీ చైర్మన్ మంజు శ్రీ జైపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లాలో 27 గ్రామ పంచాయతీలు జిల్లా స్థాయి అవార్డులు అందుకున్నాయన్నారు. నిన్న సోలాపూర్ నుంచి కొందరు కౌన్సిలర్లు వచ్చారని, 4 నుంచి 5 రోజులకు ఒకసారి నీరు వస్తుందట.. బీదర్ లో బావుల దగ్గర నుంచి నీళ్లు తెచుకుంటున్నారట.. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలలో ఇది పరిస్థితి అని ఆయన వివరించారు. మన దగ్గర ఇంటింటికి ప్రతి రోజు నీరు వస్తుంది…ఇది తెలంగాణ మోడల్ అని ఆయన వ్యాఖ్యానించారు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు 10 వేలు ఇస్తున్నారు..బీజేపీ వాళ్ళు 10 వేలు సరిపోవు అంటున్నారని, ఢిల్లీ నుంచి 10 వేలు తెచ్చి.. మీరో 10 వేలు ఇవ్వండి ఇద్దరం కలిపి 20 వేలు ఇద్దామన్నారు.
Also Read : T.Congress : రచ్చకెక్కిన హనుమకొండ కాంగ్రెస్ వర్గ పోరు
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
బీజేపీకి రైతుల గురించి మాట్లాడే అర్హత లేదని, నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ.. పెట్రోల్ ధరలు పెంచింది బీజేపీ అని ఆయన మండిపడ్డారు. గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ.. మోటర్లకు మీటర్లు పెట్టింది బీజేపీ అని ఆయన దుయ్యబట్టారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా ఎందుకు చేయలేదని బిజెపి వాళ్ళు అడుగుతున్నారు…ముందు మీ ప్రధాని రాష్ట్రంలో అమలు చేయండని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి సంసద్ యోజన లో 10 కి 10 తెలంగాణ గ్రామ పంచాయతీలే ఉన్నాయని, సర్పంచ్ లకు శుభవార్త చెబుతున్నామన్నారు. ఏప్రిల్ 1 నుంచి నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలో వేస్తామని ఆయన తెలిపారు. పని చేసిన వెంటనే బిల్లులు చెల్లించుకునే అవకాశం మీకే కల్పించామని, గతంలో సర్పంచ్ లకు కాలిపోయిన మోటర్లకు రిపేర్ చేయించుడే పని… బావులను తవ్వుడే పని అని, ఆనాడు అంతా ఎర్ర దీపాలు, గుడ్డీ దీపాలు కరెంట్ సరిగా లేకుండే.. కానీ ఇప్పుడు ఎక్కడ చూసిన 24 గంటల కరెంట్ వస్తుంది.. రాబోయే రోజుల్లో సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు అందుకోవాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!