Site icon NTV Telugu

Harish Rao : ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా హ్యాట్రిక్ కేసీఆర్ దే

Harish Rao

Harish Rao

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పబ్లిక్ మీటింగ్‌లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా హాట్రిక్ కేసీఆర్ దే అని చెబుతారన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేశామన్నారు మంత్రి హరీష్‌ రావు. కాంగ్రెస్ వాళ్లు రోజుకో మేనిఫెస్టో రోజు కో డిక్లరేషన్ ఇస్తున్నారని, 50 ఏళ్లు ప్రభుత్వంలో ఉన్న ఏం చేయలేకపోయారని మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. కేసీఆర్ ఏం చెప్పాడో అది చేసి చూపించాడు, ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా రైతుబంధు, రైతు బీమా ఇచ్చాడని ఆయన అన్నారు.

Also Read : Hi Nanna: మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి సిద్దమైన న్యాచురల్ స్టార్

కేసీఆర్ జనాలను నమ్ముకున్నాడు, బీజేపీ ఏమో జమిలీని నమ్ముకున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అబద్దాలు కావాలా.. కేసీఆర్‌ ఇచ్చే రైతు బంధు కావాలా.. కేసీఆర్‌ అభివృద్ధి ఫలాలు పొందని ఇల్లు ఒకటి కూడా ఉండదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఉండే బీజేపీ వాళ్లు వడ్లు కొనకున్న మన కేసీఆర్ వడ్లు కొన్నాడని, తిట్లు కావాలంటే కాంగ్రెస్ కు ఓటెయ్యండి కిట్లు కావాలంటే కేసీఆర్ కు ఓటేయండని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలో ముఖ్యమంత్రి కేసిఆర్ ను తీసుకువచ్చి గౌరవెల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తామన్నారు మంత్రి హరీష్‌ రావు.

Also Read : Business Idea: అదిరిపోయే బిజినెస్ ఐడియా .. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.45 వేలు సంపాదించవచ్చు..

Exit mobile version