Hi Nanna: మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి సిద్దమైన న్యాచురల్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hi Nanna: న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం హాయ్.. నాన్న. వైరా క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి, విజయేంద్ర రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత నాని మరోసారి జెర్సీలో నటించిన ఫాదర్ పాత్రలో కనిపిస్తున్నాడు. జెర్సీలో తండ్రీకొడుకుల బంధాన్ని చూపించగా.. ఇందులో తండ్రీకూతుళ్ల బంధాన్ని చూపించనున్నారు. ఈ చిత్రం కోసం నాని టోటల్ గా మారిపోయాడు. క్లీన్ షేవ్, గుబురు జుట్టుతో ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. ఇక ఈ సినిమాకు హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. మలయాళంలో హృదయం సినిమాకు సంగీతం అందించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచిన హేషమ్ తెలుగులో ఖుషీ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఇక్కడ కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.
Dhruva Sarja: సమాధి దగ్గర భార్య సీమంతం చేసిన హీరో.. ఎందుకంటే ..?
Also Read
- Hashmi - Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
- Karthik Subbaraj : స్టార్స్‌ని పక్కన పెట్టి రైజింగ్ హీరోలతో ఆడియన్స్ టెస్ట్‌కు రెడీ అయిన కార్తీక్ సుబ్బరాజ్
- Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
- KVN : కేవియన్ ఖాతాలో మరో డిజాస్టర్.. బాక్సాఫీస్ బాంబ్‌గా హైవాన్
ఖుషీ అంత పెద్ద సక్సెస్ అయ్యింది అంటే.. అందులో మ్యూజిక్ ప్రధాన కారణమని చెప్పాలి. అలాంటి సంగీత దర్శకుడు హాయ్ నాన్నకు సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను మేకర్స్ అభిమానులకు అందించారు. ఈ సినిమా మ్యూజిక్ తో మ్యాజిక్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలిపారు. ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఒక చిన్న ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో నాని, మృణాల్ మాత్రం కనిపించారు. ఇక ఈ ప్రోమోను నాని షేర్ చేస్తూ.. ” ఈ ఆల్బమ్ మీ పాదాల నుంచి తుడుచుకుంటూ వస్తుంది.. ఒక పాటతో ప్రారంభిద్దాం” అంటూ రాసుకొచ్చాడు. త్వరలోనే సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపాడు. మరి ఈ సినిమాతో నాని ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
https://x.com/NameisNani/status/1701907841865720039?s=20
తాజావార్తలు
-
Harassment: మారండ్రా బాబు.. మరో దారుణం.. రోడ్డుపై మైనర్ బాలికపై వేధింపులు
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
ట్రెండింగ్
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్‌ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!