బిజినెస్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇంట్లో నుంచే డబ్బులు సంపాదించే అదిరిపోయే వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చెయ్యాలనుకొనేవారికి ఇది బెస్ట్ చాయిస్.. సెల్ఫ్-లైఫ్ ఎక్కువగా ఉండే వీటిని తయారు చాలా సులభం. బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కిచెన్‌లోనే బిస్కెట్లను తయారు చేయవచ్చు. బిస్కెట్ తయారీకి పదార్థాలను కలపడం, బిస్కెట్ల ను స్క్వేర్ లేదా రెక్టాంగిల్ షేప్‌లో బేక్ చేయడం, వాటిని ప్యాక్ చేయడం వంటి నాలుగు పనులు చేస్తే సరిపోతుంది.. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే బిజినెస్ ఇది..ఈ బిజినెస్ తో నెలకు రూ.35వేల నుంచి రూ.45వేల వరకు సంపాదించవచ్చు. వ్యాపార కార్యకలాపాలను మరింత పెంచితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి, లాభాలేంటి ఇటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..
బిస్కెట్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, రూ.5 లక్షలు పెట్టుబడి మొత్తం అవసరం అవుతుంది. రూ.90,000 పెట్టుబడి పెట్టగలిగితే, ప్రధాన మంత్రి ముద్ర యోజన నుంచి రూ.4.1 లక్షల రుణాన్ని పొందవచ్చు…ఈ పథకం కింద, బ్యాంక్ నుంచి రూ.2.5 లక్షల టర్మ్ లోన్, రూ.1.75 లక్షల వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందుతారు. మొత్తంగా రూ.4.25 లక్షల రుణం పొందవచ్చు. ఈ వ్యాపారానికి కావలసిన ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, మిక్సర్లు, గ్రైండర్లు వంటి పరికరాలకు, పిండి, చక్కెర, వెన్న, గుడ్లు, స్పైసెస్ వంటి మొదలగు పదార్థాలకు డబ్బులను పెట్టాలి..
ఈ స్కీమ్ కింద పాపడ్, బిస్కెట్, బ్రెడ్, బన్ తయారీ వంటి వివిధ వ్యాపారాలకు రుణాలు అందుబాటులో ఉంటాయి. అయితే,శిశు, కిషోర్, తరుణ్ వంటి మూడు రకాల లోన్స్ పొందవచ్చు. శిశు రుణం కింద వ్యాపారులు రూ.50 వేల వరకు, కిషోర్ రుణం కింద రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు, తరుణ్ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు రుణాలను పొందవచ్చు.. ఈ వ్యాపారానికి సొంత స్థలం ఉంటే కొంచెం డబ్బులు సేవ్ అవుతాయి.. లైసెన్స్ ను పొందాలి.. ఇకపోతే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్, ట్రేడ్ మార్క్, మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ కింద రిజిస్ట్రేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అనుమతి తీసుకోవాలి.. ముందు అన్ని క్లియర్ అయ్యాకే బిజినెస్ ను మొదలు పెట్టాలి.. ఒకసారి క్లిక్ అయితే ఇక లాభాలే..