Site icon NTV Telugu

Harish Rao : కాంగ్రెస్ నేతలు రైతులకు బేషరతు క్షమాపణ చెప్పాలి

Harish Rao

Harish Rao

మంత్రి హరీష్ రావు కాంగ్రెస్‌ నేతలపై నిప్పుల చెరిగారు. కాంగ్రెస్ నాయకులు కుడితిలో పడ్డ ఎలుకల్లా కొట్టుకుంటున్నారని, రైతులకు 3 గంటల కరెంట్ చాలని పీసీసీ చీఫ్ రేవంత్ స్వయంగా మాట్లాడారని, రైతుల పట్ల కాంగ్రెస్ తన నిజస్వరూపాన్ని బయట పెట్టుకుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌పై రైతులు తిరగబడుతున్నారని, కరెంట్‌పై కేసీఆర్‌ను విమర్శిస్తే సూర్యునిపై ఉమ్మి వేసినట్లే అని ఆయన అన్నారు. బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ కారణం అనడం పెద్ద జోక్ అని, రైతులపై కాల్పులు జరిగిన రోజే విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని కేసీఆర్ అప్పటి సీఎంకు లేఖ రాశారన్నారు. ఉద్యమం పుట్టిందే కరెంట్ నుంచి అన్న హరీష్‌ రావు… కేసీఆర్‌పై ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరన్నారు. కాంగ్రెస్ నేతలు వెళ్లి కరెంట్ వైర్ ముట్టుకొండి. 24 గంటల కరెంట్ వస్తుందో లేదో తెలుస్తోంది అని మంత్రి వ్యాఖ్యానించారు.

Also Read : Yashasvi Jaiswal: అరంగేట్రం టెస్టులో 150 పరుగుల మార్క్ దాటిన యశస్వి జైస్వాల్..

అంతేకాకుండా.. లాగ్ బుక్ లు ఎందుకు…కరెంట్ తీగలు కాంగ్రెస్ నేతలు పట్టుకుంటే సరి. బీఆర్ఎస్ పాలనలో బాగుందో దమ్ముంటే రండి రెఫరెండం కొరదాం. వచ్చే ఎన్నికల్లో కరెంట్‌పై రెఫరెండం కొరదాం వస్తారా. 24 గంటలు కరెంట్ మా విధానం. మూడు పంటలా, మూడు గంటల కరెంటా, మతం మంటలా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన సమయం. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వడం లేదు. కాంగ్రెస్ 9 గంటలు కరెంటు అని మూడు గంటలు కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ నేతలు రైతులకు బేషరతు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ గుండాల చేతిలోకి పోయిందా ? మా పార్టీ నాయకుడు దశోజు శ్రవణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయి.’ అని మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యానించారు.

Also Read : Gudivada Amarnath: పెళ్లిళ్లు చేసుకోవడంలో పవన్ విప్లవకారుడు.. అది ప్రజలపై రుద్దుతున్నారు..

Exit mobile version