భూమికి బరువయ్యే పంట తెలంగాణలో పండుతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన సిద్ధిపేటలో మాట్లాడుతూ.. కాలంతో పని లేకుండా బంగారం లాంటి పంట పండుతుందని, ఆనాడు కరెంట్ తిప్పలు..ఎరువు కోసం తిప్పలు.. పంట అమ్మాలన్న తిప్పలే అని ఆయన అన్నారు. ప్రతి ఇంట్లో కన్న కొడుకులా కేసీఆర్ ఉన్నాడని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్లు 30 ఏళ్ళు.. జీడీపీ వాళ్ళు 20 ఏళ్ళు పాలించారని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీల ఉన్నోడు కాళేశ్వరం దండగే అన్నాడని, ఇక్కడ ఉన్నోళ్లకు తెలుసు దండగ… పండగా అని మంత్రి హరీష్ రావు అన్నారు. నిన్న మోడీ వచ్చి మనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. రాష్టం కేంద్రానికి సహకరించట్లేదు అన్నారని, మోడీ మాటలు దొంగే దొంగ అన్నట్టు ఉందని మంత్రి వ్యాఖ్యానించారు.
Also Read : Dalailama : మైనర్ బాలుడికి దలైలామా ముద్దు.. వైరల్ అవుతున్న వీడియో
మా రాష్ట్ర విభజనలో మాకు రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదని, వరంగల్ లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేంద్రం ఇవ్వలేదని, రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వంది మీరని ఆయన అన్నారు. తెలంగాణ అభివృద్ధి సహకరించకుండా అడ్డు పడుతుంది మీరు మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మీదికి బీజేపీ వాళ్ళు ఎన్నో మాటలు చెబుతారని, ఇప్పటికి డబుల్ ఇంజన్ సర్కార్ యూపీలో జనరేటర్లు పెట్టి వ్యవసాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ పల్లెలు ఢిల్లీలో జాతీయ అవార్డులు తెచ్చుకున్నాయని, టీవీలల్లో వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని మనం ఆగం కావద్దని ఆయన అన్నారు.
Also Read : Somu Veerraju: కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పూరిని కలిసిన సోము వీర్రాజు.. ఏపీ సర్కారుపై ఫిర్యాదు