Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Harish Rao Counter To Rajntah Singh

Harish Rao : బీజేపీది మేకపోతు గాంభీర్యం

Published Date :October 16, 2023 , 10:18 pm
By Gogikar Sai Krishna
Harish Rao : బీజేపీది మేకపోతు గాంభీర్యం
  • Follow Us :
  • google news
  • dailyhunt

కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ నేడు తెలంగాణలో పర్యటించారు. ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభలో పాల్గొని ప్రసంగించారు. అయితే.. ఈ సందర్భంగా రాజ్‌ నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీంతో.. రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై మంత్రి హరీష్ రావు కౌంటర్‌ ఇచ్చారు. రాజ్ నాథ్ సింగ్ ఇక్కడ వచ్చి బాగా మాట్లాడుతున్నారని, బీజేపీది మేకపోతు గాంభీర్యమంటూ హరీష్‌ రావు సెటైర్లు వేశారు. మీకు పోటీ చేయడానికి నియోజకవర్గాల్లో నాయకులే లేరని, తెలంగాణ విభజన చట్టంలో ఉన్న హామీలను ఇప్పటి వరకు బిజెపి ఎందుకు నేరవేర్చలేదన్నారు. తెలంగాణ కి హక్కుగా రావాల్సిన 1500 కోట్లు ఆపారని, బోరు బావులకు మీటర్లు పెట్టలేదని 35 వేల కోట్లు ఆపారన్నారు హరీష్‌ రావు.

అంతేకాకుండా.. ‘తెలంగాణ లో ఏం అభివృద్ధి జరగలేదు అని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. మేం అభివృద్ధి చేయకపోతే మా పథకాలను మీరు ఎందుకు కాపీ కొట్టారు. ఢిల్లీలో మాకు అవార్డులు ఇస్తారు..పార్లమెంట్ లో ప్రశంసిస్తారు.. గల్లీలో మాత్రం తిడుతారు. ప్రధాని మోడీ కూడా సీఎం కేసీఆర్ ఎప్పుడు వచ్చినా నీళ్ల గురించి మాట్లాడుతారని స్వయంగా ప్రధాని చెప్పారు. ఓట్లు వచ్చాయని తిడితే మీ మాటలు జనం నమ్మే పరిస్థితి లేదు.
కాంగ్రెస్, బీజేపీ వాళ్ళకి సీట్లు కావాలంటే ఢిల్లీకి పోవాలి, పదవులు కావాలంటే ఢిల్లీకి పోవాలి. చివరికి మీకు ఓట్లు కావాలన్న ఢిల్లీ నుంచి నేతలు రావాలి. రాజ్ నాథ్ సింగ్ కి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదివి నవ్వుల పాలయ్యారు. స్కీములతో తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తుంటే కర్ణాటక లో రోజుకో స్కాములో కాంగ్రెస్ పార్టీ లీలలు బయటికి వస్తున్నాయి. 11సార్లు గెలిచిన కాంగ్రెస్ చేయని అభివృద్దిని పదేళ్ళలో సీఎం కేసీఆర్ చేసి చూపించారు.

బీజేపీ హాయంలో సిలిండర్ కొంటేనే కళ్లలోంచి నీళ్లు వస్తున్నాయి. ఆనాడు 300 ఉంటే ధర్నాలు చేసిన బీజేపీ… ఈ రోజు వెయ్యికి పైగా ధరకు ఇస్తుంది. ఏ ప్రభుత్వం కూడా విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం పెట్టలేదు. మేనిఫెస్టోతో ప్రతిపక్షాలు బిత్తరపోయాయి. జనమంతా కారు గుర్తుకే ఓటద్దామని ఫిక్స్ అయ్యి ఉన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసిన హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ దే. కాంగ్రెస్ వాళ్లు టికెట్లు అమ్ముకున్నారని రోజు గొడవలు అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నోట్లకి సీటు అమ్ముకుంటున్నారని వాళ్ల పార్టీ నాయకులే అంటున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టిందని రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాపీ కొట్టింది మీరు..మేము కాదు. రైతు బంధు పెట్టింది ఎవరు..సీఎం కేసీఆర్ కాదా. రైతులు, పెన్షన్ దారులు అందరూ సీఎం కేసీఆర్ వైపే ఉన్నారు. నమ్మకానికి మారు పేరు కేసీఆర్.. నయవంచన కి మారు పేరు కాంగ్రెస్ పార్టీ. రైతు భీమా తరహాలో కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా పథకం కావాలని ఎవరైనా ఆడిగారా.’ అని హరీష్‌ రావు వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Big Nes
  • breaking news
  • harish rao
  • latest news
  • Rajnath Singh

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions