Site icon NTV Telugu

Harish Rao : నాడు తెలంగాణలో కూలీ పనులు దొరకలేదు, నేడు కూలీ వాళ్ళు దొరకడం లేదు

Harish Rao

Harish Rao

సిద్దిపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ఆనాడు తెలంగాణ కోసం కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేయలేదన్నారు. ఉద్యమ సమయంలో రేవంత్ రెడ్డి భుజం మీద గన్ను పెట్టుకొని తిరిగాడని, ఇంకో 15 రోజులైతే కాంగ్రెస్, బీజేపీ నాయకులు గ్రామాల్లోకి బయలుదేరుతారని ఆయన వ్యాఖ్యానించారు. ఓట్ల పండుగ రాగానే కాంగ్రెస్, బీజేపీ నాయకులు మూడు నెలలు తిరుగుతారని, నాడు తెలంగాణలో కూలీ పనులు దొరకలేదు, నేడు కూలీ వాళ్ళు దొరకడం లేదని హరీష్‌ రావు అన్నారు.

Also Read : Uttar Pradesh: చదివించి లెక్చరర్ చేసిన భర్త.. కాళ్లు విరగ్గొట్టిన భార్య

రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోతోందని, ఈసారి 100 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని అన్నారు. బీఆర్ఎస్ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని, మళ్లీ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్ ప్రమాణం చేయడం తధ్యమని జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే.. దేశంలో అనేక రాష్ట్రాల్లో కరెంటు కోతలు ఉన్నా.. తెలంగాణలో మాత్రం 24 గంటల కరెంట్ అందిస్తున్నామని మంత్రి హరీష్‌ తెలిపారు. దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని.. ఇక్కడి బియ్యాన్ని పక్క రాష్ట్రాలు అడుగుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్‌ హామీ మేరకు నెల రోజుల్లో రైతులందరికీ రూ. లక్ష రుణమాఫీ చేస్తామని హరీష్ రావు వెల్లడించారు.

Also Read : Uttar Pradesh: చదివించి లెక్చరర్ చేసిన భర్త.. కాళ్లు విరగ్గొట్టిన భార్య

Exit mobile version