NTV Telugu Site icon

Harish Rao : ఎన్నికలంటే మూడు రోజుల పండగ కాదు, ఐదేండ్ల భవిష్యత్తు

Harish Rao

Harish Rao

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో హుస్నాబాద్‌ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సతీష్ కుమార్ కు మద్దతుగా రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. ఎన్నికలంటే మూడు రోజుల పండగ కాదు, ఐదేండ్ల భవిష్యత్తు అని ఆయన అన్నారు. కరీంనగర్ లో మూడు సార్లు ఓడి పోయి అక్కడ చెల్లక హుస్నాబాద్ వాళ్ళు అమాయకులని ఇటు బయల్దేరిండు పొన్నం ప్రభాకర్ అని, కాంగ్రెస్ వాళ్ళు కోర్టుల్లో కేసు లు వేసి గౌరవెల్లి ప్రాజెక్టు ను అడ్డుకున్నారు.

Also Read : ODI World Cup 2027: ముగిసిన 2023 వరల్డ్ కప్.. తర్వాతి ప్రపంచకప్ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్..!

ఈ యాసంగి లో గౌరవెల్లి ప్రాజెక్టును గోదారి జలాలతో నింపి సాగు నీళ్ళు అందిస్తామన్నారు. కాంగ్రెసోల్లు అన్ని బిఆర్ఎస్ పథకాలే నకల్లు కొట్టారు, చివరకు రామక్క పాటలో కొట్టుకుపోతామని ఆ పాటను కూడా నకలు కొట్టారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే కర్ణాటకలో 5 గ్యారంటీలు అన్నారు, కానీ ఇప్పుడు అక్కడ ఉన్న కరెంట్ పోయి రైతులు గగ్గోలు పెడుతున్నారని, 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ ఉండగా 3 గంటలు ఇచ్చే కాంగ్రెస్ ఎందుకని ఆయన అన్నారు. తెలంగాణలో రైతులు మీటర్లు పెట్టలేదని, మిగతా రాష్ట్రల వాళ్ళు మీటర్లు పెట్టారనీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ నేడు హైదరాబాద్ లో ఒప్పుకుందని, హుస్నాబాద్ నియోజకవర్గంలోని మిగతా మండలాల కంటే అక్కన్నపేట మండలంలో సతీష్ కుమార్ కు ఎక్కువ మెజారిటీ ఇస్తే మండలాన్ని దత్తత తీసుకుంటానన్నారు.

Also Read : Bandi Ramesh: కూకట్ పల్లిలో బండి రమేష్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి వెయ్యి మంది యువత