Site icon NTV Telugu

Harish Rao : రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి

Harish Rao

Harish Rao

రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీకి పడుతుందని వ్యాఖ్యానించారు వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. నాడు కిరణ్ కుమార్ రెడ్డి రూపాయి ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నడని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదన్నారు. కానీ, ప్రజలు గుణపాఠం చెప్పారు, కాంగ్రెస్ గల్లంతు చేశారని ఆయన గుర్తు చేశారు. నెత్తి లేని, కత్తి లేని నేతలు నత్తి నత్తి మాట్లాడుతరు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. పెట్రోల్, డీజిల్ పై సెస్సుల పేరిట కేంద్రం 8 ఏళ్లలో 89 వేల కోట్లు వసూలు చేసిందని ఆయన మండిపడ్డారు. సెస్సుల పేరిట కేంద్రం అడ్డదారిలో ప్రజలను దోపిడీ చేస్తున్నదని మంత్రి హరీష్‌ రావు ధ్వజమెత్తారు.

Also Read : PM Modi: ప్రధాని డిగ్రీ వివరాలు అవసరం లేదు.. కేజ్రీవాల్‌కి హైకోర్టు జరిమానా..

ఇదిలా ఉంటే.. ఏప్రిల్‌ నుంచి ఔషధాల ధరలు 12 శాతం పెంచనుండడంపై నిన్న ట్వి్ట్టర్‌ వేదికగా మంత్రి హరీష్‌ రావు స్పందించారు. దేశంలో బీజేపీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ‘ప్రజల ప్రాణాలు కాపాడే ఔషధాల ధరలు 12% పెంచాలని కేంద్రం నిర్ణయించడం దారుణం. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేసే చర్య. జ్వరం, ఇన్ఫెక్షన్స్, బీపీ, చర్మ వ్యాధులు, ఎనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతో పాటు పెయిన్ కిల్లర్లు, యాంటీ బయోటిక్స్, యాంటీ ఇన్ఫెక్టివ్స్ వంటి 800 పైగా నిత్యావసర మందుల ధరలు పెంచితే, అది పేద, మధ్య తరగతి ప్రజలకి భారం అవుతుంది. సామాన్యుడిని ఇబ్బంది పెట్టడమే బిజెపి ప్రభుత్వం పనిగా పెట్టుకుంద’ని హరీష్ రావు ట్వీట్ చేశారు.

Also Read : Raviteja: ‘రావణాసుర’తో కల నెరవేరింది: హర్షవర్ధన్ రామేశ్వర్

Exit mobile version