Harish Rao : క్రిస్మస్‌ను అధికారికంగా నిర్వహించిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ప్రతి క్రిస్మస్‌కు పేద క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్‌లు అందించడం ప్రత్యేకమైనది అని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ సోదరులు, సోదరీమణులపై కేసీఆర్ చేసిన ప్రయత్నాలు, ఎంత బాగా చూసుకున్నారో అందరికీ తెలుసని చెప్పారు. మెదక్ చర్చి వందేండ్లు పూర్తి అవడాన్ని పురస్కరించుకుని హరీష్ రావు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెదక్ చర్చి ఆసియాలో రెండో అతిపెద్ద క్రైస్తవ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. ఈ చర్చి నిర్మాణం 1914లో ఇంగ్లాండ్‌కు చెందిన రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ ప్రారంభించి, 1924లో పూర్తి అయ్యిందని వివరించారు.
Vijay Devarakonda : ‘విజయ్ దేవరకొండ’ సినిమా పై క్రేజీ అప్ డేట్
1914లో మెదక్ ప్రాంతంలో తీవ్రమైన కరువు ఉండి, ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. ఈ పరిస్థితిని చూసి చార్లెస్ వాకర్ ఫాస్నెట్ ఉచితంగా కాకుండా ప్రజలకు పని చూపించి వారి ఆకలిని తీర్చేందుకు సంకల్పించారని తెలిపారు. తాజాగా, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, హరీష్ రావు కేసీఆర్ పాలనలో క్రిస్టియన్ సోదరులు ఎలా గుర్తించబడినారో చెప్పారు. కేసీఆర్ క్రిస్మస్‌ను రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించి, 25 డిసెంబర్ తేదీతో పాటు 26న కూడా సెలవుగా ప్రకటించారు. ఆయన ప్రతి క్రిస్మస్ నాడు పేద క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్‌లు ఇచ్చారని హరీష్ రావు చెప్పారు.
కేసీఆర్ ప్రభుత్వంలో అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చి, సుఖంగా జీవించేలా చూసారని చెప్పారు. హైదరాబాద్, తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వం అనేది అందరికీ ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. క్రిస్మస్ శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే బోధనలతో అందరి జీవితాలను సుఖంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, ఆయన క్రిస్టియన్ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Kadapa Municipal Corporation: మేయర్ పక్కనే కుర్చీ వేయాలి.. ఎమ్మెల్యే మాధవీ రెడ్డి డిమాండ్!