Vijay Devarakonda : ‘విజయ్ దేవరకొండ’ సినిమా పై క్రేజీ అప్ డేట్
- ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
- 1854-78 మధ్య కాలంలో జరిగే కథ
- కీలక పాత్రలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ సంవత్సరం ఫ్యామిలీ స్టార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర తీవ్ర నిరాశను మిగిల్చింది. ఆ సినిమా ఫలితంతో విజయ్ దేవరకొండ సినిమాల ఎంపిక విషయంలో కాస్త జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక భారీ సినిమాను ఆయన చేస్తున్నాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయింది. త్వరలోనే షూటింగ్ పూర్తి చేస్తామని మేకర్స్ ప్రకటించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే కాకుండా మరో రెండు మూడు సినిమాలకు కూడా రౌడీ స్టార్ ఓకే చెప్పాడు.
టాక్సీవాలా సినిమాతో విజయ్ దేవరకొండకు సక్సెస్‌ను అందించిన దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ డైరెక్షన్లో మరో సినిమా రూపొందబోతుంది. గతంలోనే వీరి కాంబో మూవీని ప్రకటించినా మేకింగ్‌కు కాస్త టైం పట్టింది. ఎట్టకేలకు సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదటైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాదిలోనే సినిమాను ప్రారంభించి అదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న రాహుల్ సంకృత్యాన్ ఈసారి కూడా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ ను ఎంపిక చేసుకున్నారని, విజయ్ దేవరకొండ సైతం ఆ కాన్సెప్ట్ విని ఫిదా అయినట్లు సమాచారం.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
Read Also:Iran Supreme Leader: మేము రంగంలోకి దిగితే అలాంటి సంస్థల అవసరం లేదు..
వచ్చే సంవత్సరం జనవరి నాలుగో వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుందని, మొదటి షెడ్యూల్ లో విజయ్ పాత్రకు సంబంధించిన ఇంట్రో సీన్ ను అలాగే, హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్ ను షూట్ చేస్తారని టాక్. అన్నట్లు ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కోసం రాహుల్ సంకృత్యాన్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కొన్ని లొకేషన్స్ ను కూడా ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరి కొత్త గెటప్ లో కనిపిస్తాడని.. ముఖ్యంగా విజయ్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని.. అలాగే, 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి, సినిమాలో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ ప్రధాన పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. ‘ది మమ్మీ’, ‘ది మమ్మీ రిటర్న్స్’ సినిమాల్లో విలన్‌గా నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న ఆర్నాల్డ్ వోస్లూ ను తెలుగు సినిమాలో నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నాయట. ఈ దక్షిణాఫ్రికా నటుడు పాత్ర మెచ్చితే ఏ భాషలో నటించేందుకైనా రెడీగా ఉంటారని తెలుస్తోంది. ఎంతైనా ‘రాహుల్ సంకృత్యాన్’ దర్శకత్వంలో నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగ రాయ్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో, విజయ్ దేవరకొండ సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Read Also:MLA Parthasarathi: నేను చెబితే సీఎం చంద్రబాబు చెప్పినట్టే.. ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!