NTV Telugu Site icon

Harish Rao: సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్

Harish Rao

Harish Rao

సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. “మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉంటే సమ్మక్క సారక్క, సీతమ్మ సాగర్, వార్ధా ప్రాజెక్టు, కాళేశ్వరంలో మూడో ప్రాజెక్టుకి అనుమతులు ఇవ్వమని చెప్పండి. అప్పుడు మేము మీకు నిజంగా తెలంగాణపై ప్రేమ ఉందని నమ్ముతాం. మీ రెండు కళ్ళ సిద్ధాంతం కరెక్ట్ అని చెబుతాం. కేంద్ర బడ్జెట్ లో మీ వాటా మీరు తీసుకున్నారు.. మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు అని ఎందుకు ప్రశ్నించలేదు. మీకు తెలంగాణపై ప్రేమ లేదు.. మా హక్కుల కోసం ఏనాడు పోరాడలేదు. గోదావరిలో తెలంగాణకి 969 టీఎంసీల నీటిని కేటాయించారు. అవి మమ్మల్ని వాడుకొనివ్వండి.” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

READ MORE: Delimitation Row: డీలిమిటేష‌న్‌పై తమిళనాడు అఖిలపక్ష సమావేశంలో కీల‌క నిర్ణ‌యాలు

మీరు మాట్లాడుతున్నదానికి మీ చేతలకు సంబంధం లేదని సీఎం చంద్రబాబును బీఆర్ఎస్ అధినేత హరీష్ రావు విమర్శించారు. వైజాగ్ ఉక్కు పరిశ్రమలాగా మా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని కాపాడాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చినట్టు పాలమూరు ప్రాజెక్టుకి జాతీయ హోదా అడగాలన్నారు. ఇక్కడ ఉన్న ఎంపీలు పార్లమెంట్లో మౌనం వహిస్తున్నారని.. ఇంత జరుగుతున్న సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని విమర్శలు గుప్పించారు.

READ MORE: Hyderabad: చాదర్‌ఘాట్ శిరీష హత్య కేసు.. ముగ్గురు నిందితులు వీళ్లే..