Site icon NTV Telugu

HHVM : కాశీలో గ్రాండ్ ఈవెంట్‌.. చీఫ్ గెస్ట్ గా యోగి ఆదిత్యనాథ్‌?

Pawan Cm Yogi

Pawan Cm Yogi

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆధ్వర్యంలో మొదలైన ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఎట్టకేలకు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తయింది. ఇక ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా, ఎన్నో వాయిదాల తర్వాత, 2025 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్ర యూనిట్, హైదరాబాద్, కాశీ, మరియు తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్‌లను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేకించి, కాశీలో జరగనున్న ఈవెంట్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

READ MORE: Kishan Reddy: ఆ ఉత్తరం ఓ డ్రామా.. ఈ పార్టీలు ఎప్పటికైనా ప్రజల కొంపలు ముంచుతాయి..!

‘హరిహర వీరమల్లు’ సినిమా 17వ శతాబ్దం నేపథ్యంలో మొఘల్ చక్రవర్తుల కాలంలో ఒక ధీరోదాత్తమైన యోధుడి కథగా రూపొందుతోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో వీరమల్లు అనే యోధుడి పాత్రలో నటిస్తున్నారు, ఇందులో కోహినూర్ వజ్రాన్ని మొఘల్ రాజుల నుంచి చేజిక్కించుకునే ధీరోదాత్త పాత్రలో కనిపించనున్నారు. సినిమా యూనిట్ ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో ఇటీవల జరిగిన ఈవెంట్‌లో ‘అసుర హననం’ అనే సింగిల్ విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టింది. ఇక కాశీలో ఒక గ్రాండ్ ఈవెంట్, తిరుపతిలో మరో ఈవెంట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాశీలో జరగనున్న ఈవెంట్‌కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ బిజెపితో రాజకీయంగా సన్నిహితంగా ఉండటం, అలాగే సినిమా ఒక చారిత్రాత్మక యోధుడి కథగా రూపొందడం ఈ నిర్ణయానికి కారణమని సమాచారం. ఈ ఈవెంట్ సినిమాకు జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది.

READ MORE: OPPO A5x 5G: రూ.13,999కే 6.67 అంగుళాల డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ బాడీ, 6000mAh బ్యాటరీతో ఒప్పో A5x లాంచ్..!

Exit mobile version