OPPO A5x 5G: రూ.13,999కే 6.67 అంగుళాల డిస్‌ప్లే, మిలిటరీ గ్రేడ్ బాడీ, 6000mAh బ్యాటరీతో ఒప్పో A5x లాంచ్..!
- 6.67 అంగుళాల HD+ LCD స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
- MediaTek Dimensity 6300 (6nm) ప్రాసెసర్
- 4GB RAM + 4GB వర్చువల్ RAM, 128GB స్టోరేజ్
- వెనుక 32MP ప్రైమరీ కెమెరా, ముందు 5MP సెల్ఫీ కెమెరా
- 6000mAh బ్యాటరీ, 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OPPO A5x 5G: ఒప్పో సంస్థ తన తాజా 5G స్మార్ట్‌ఫోన్ A5x 5Gను భారత మార్కెట్లో విడుదల చేసింది. గత ఏడాది వచ్చిన A3x 5Gకి అప్డేటెడ్ గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ మొబైల్ తక్కువ ధరలో మంచి స్పెసిఫికేషన్లు, మిలిటరీ గ్రేడ్ బాడీ, పెద్ద బ్యాటరీ సామర్థ్యం వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. మరి ఆ విశేషాలను ఒకసారి చూసేద్దామా..
డిస్‌ప్లే, డిజైన్:
OPPO A5x 5Gలో 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ మొబైల్ మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H సర్టిఫికేషన్‌తో వచ్చింది. అంటే ఇది అధిక వేడి, తేమ, షాక్‌లకు కూడా నిలబడేలా టెస్ట్ చేయబడింది. ఇక అలాగే IP65 రేటింగ్ కలిగి ఉండడం వల్ల మట్టితో పాటు నీటి జల్లుల నుంచి కూడా రక్షణ ఉంటుంది. ఈ ఫోన్‌లో 360 డిగ్రీల ఆర్మర్ బాడీ టెక్నాలజీ ఉపయోగించబడింది. ఇది ఫ్లాగ్‌షిప్ స్థాయి గ్లాస్, హై స్ట్రెంత్ అలాయ్ ఫ్రేమ్‌తో రూపొందించబడింది. గత మోడల్‌తో పోలిస్తే 160% ఎక్కువ ఇంపాక్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంది.
Also Read
Read Also: Test Retirement: టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్..?!

ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ:
ఈ ఫోన్‌లో మీడియాటెక్ Dimensity 6300 6nm చిప్‌సెట్ ఉంది. 4GB ర్యామ్ (4GB వర్చువల్ ర్యామ్ ), 128GB స్టోరేజ్ ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఇందులో ఫ్రంట్ కెమెరా 5MP కాగా, వెనుక భాగంలో మెరుగైన 32MP ప్రైమరీ కెమెరా ఉంది. ఫోన్ డిజైన్ కేవలం 7.99mm మందం, 193 గ్రాముల బరువు మాత్రమే ఉంది. ఇక ఈ మొబైల్ లో ప్రధాన హైలైట్‌గా 6000mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

ఇక ఈ మొబైల్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో ఆండ్రాయిడ్ 15 (ColorOS 15), సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 5G, డ్యుయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, Bluetooth 5.1, USB Type-C పోర్ట్ ఉండనున్నాయి.
ధర, లాంచ్ ఆఫర్లు:
OPPO A5x 5G రూ. 13,999 ధరకు ఒక్క 4GB+128GB వేరియంట్‌లో అందుబాటులో ఉంది. మిడ్‌నైట్ బ్లూ, లేజర్ వైట్ కలర్ ఆప్షన్లలో మే 25 నుండి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఒప్పో స్టోర్, రిటైల్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. ఇక లాంచ్ ఆఫర్ల కింద.. రూ. 1000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, 3 నెలల నో-కాస్ట్ EMI (SBI, IDFC First, BOB, Federal, DBS బ్యాంకుల ద్వారా) అందించనున్నారు. అద్భుతమైన ఫీచర్లు, మంచి ఫోన్ బాడీ, ఆకర్షణీయమైన ధరతో OPPO A5x 5G మిడ్‌రేంజ్ మార్కెట్లో మంచి ఆప్షన్ కావచ్చు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!