ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీమిండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను విడుదల చేయాలని జట్టుకు సలహా ఇచ్చాడు. అతను విడుదలైన తర్వాత ముంబై రైట్ టు మ్యాచ్ కార్డ్ ఉపయోగించి తిరిగి తీసుకోవచ్చని అన్నాడు.
టీమిండియా జట్టుకు ఒక్కో ఫార్మాట్‌కు ఒక్కో కోచ్ ఉంటే బాగుంటుందని గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. దీనిని భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ సమర్థించాడు. టీమిండియా టీ20 కోచ్‌గా పేస్ దిగ్గజం ఆశిష్ నెహ్రా సరిగ్గా సరిపోతాడని హర్భజన్ సింగ్ భావిస్తున్నాడు. ఎందుకంటే అతనికి ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కంటే పొట్టి ఫార్మాట్ బాగా తెలుసు అని అన్నాడు.